జాతీయ ఫిల్మ్ అవార్డులలో తెలుగు సినిమాలకు ఐదు అవార్డులుకేంద్రప్రభుత్వం కాసేపటి క్రితం 67వ జాతీయ చలన చిత్ర అవార్డులను ప్రకటించింది. తెలుగు చిత్రాలకు వచ్చే సరికి మహేష్ బాబు మహర్షి, నాని జెర్సీ సినిమాలు అవార్డులు పొందాయి. జాతీయ ఉత్తమ చిత్రం (తెలుగు)గా నాని హీరోగాగా నటించిన ‘జెర్సీ’ ఎంపికైంది. సితార ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై గౌతమ్ తిన్ననూరి దీన్ని తెరకెక్కించారు.

అంతేకాదు, ఉత్తమ ఎడిటింగ్‌ విభాగంలో ‘జెర్సీ’ చిత్రానికి ఎడిటర్‌గా వ్యవహరించిన నవీన్‌ నూలి అవార్డు దక్కించుకున్నారు. ఇక ఉత్తమ వినోదాత్మక చిత్రం, ఉత్తమ కొరియోగ్రఫీ, ఉత్తమ నిర్మాణ సంస్థ కేటగిరిల్లో ‘మహర్షి’, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌కు అవార్డులు దక్కాయి. జెర్సీని ఇప్పటికే హిందీలో షాహిద్ కపూర్ హీరోగా రీమేక్ చేస్తున్న విషయం తెలిసిందే.

తెలుగు సినిమాలు అవార్డులు సాధించిన వివరాలు:

ఉత్తమ తెలుగు చిత్రం- జెర్సీ
ఉత్తమ ఎడిటర్ – జెర్సీ (నవీన్ నూలీ)
ఉత్తమ వినోదాత్మక చిత్రం- మహర్షి
ఉత్తమ కొరియోగ్రాఫర్- రాజుసుందరం (మహర్షి)
ఉత్తమ నిర్మాణ సంస్థ- శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ (మహర్షి)

67వ జాతీయ చలన చిత్ర అవార్డులు:

ఉత్తమ నటుడు: ధనుష్‌(అసురన్‌), మనోజ్‌ బాజ్‌పాయ్ ‌(భోంస్లే)
ఉత్తమ నటి: కంగనా రనౌత్ ‌(మణికర్ణిక/పంగా)
ఉత్తమ దర్శకుడు: బహత్తార్‌ హూరైన్‌
ఉత్తమ సహాయ నటి: పల్లవి జోషి (ది తాష్కెంట్‌ ఫైల్స్‌)
ఉత్తమ సహాయ నటుడు: విజయ్‌ సేతుపతి (సూపర్‌ డీలక్స్‌)
ఉత్తమ చిత్రం (హిందీ): చిచ్చోరే
ఉత్తమ చిత్రం (తెలుగు): జెర్సీ
ఉత్తమ చిత్రం (తమిళం): అసురన్