fitoor-movie-trailerఆదిత్య రాయ్ కపూర్, కత్రినా కైఫ్ జంటగా నటించిన “ఫితూర్” సినిమా ధియేటిరికల్ ట్రైలర్ విడుదలైంది. అభిషేక్ కపూర్ దర్శకత్వం వహించిన ఈ సినిమా పూర్తి ప్రేమ కధా చిత్రంగా రూపొందింది. ట్రైలర్ బిగినింగ్ షాట్ నుండి ఎండింగ్ షాట్ వరకు ఎక్కడా డివియేట్ కాకుండా కధను క్లుప్తంగా చెప్పడంలో సక్సెస్ అయ్యింది.

కత్రినా కైఫ్ అందచందాలకు తోడు అనయ్ గోస్వామి అందించిన ఫోటోగ్రఫీ అద్భుతంగా ఉంది. అలాగే కత్రీనా తల్లిగా టబు మరో స్పెషల్ ఎట్రాక్షన్. వీటన్నింటి కంటే ఈ సినిమా ఎంచుకున్న విడుదల తేదీ ఖచ్చితమైన ఓపెనింగ్స్ ను అందించేది. ‘ప్రేమికుల దినోత్సవం’ సందర్భంగా రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన “ఫితూర్” ఫిబ్రవరి 12న ప్రేమికులను పలకరించనుంది.