Finance minister Nirmala Sitharaman COVID-19 relief measuresకరోనా వైరస్ రక్కసి కోరల నుండి తప్పించుకోవడానికి దేశమంతా మూడు వారాల పాటు లాక్ డౌన్ ప్రకటించారు. దీనితో సమాజంలోని అత్యంత పేద వర్గాలు చాలా ఇబ్బంది పడుతున్నాయి. పనులు లేక ఆకలిదప్పులతో అలమటిస్తున్నాయి. ముందు ముందు పరిస్థితులు చాలా దారుణంగా ఉండబోతున్నాయి. దీనితో కేంద్రం వారికి ఆపన్నహస్తం అందించింది.

గరీబ్ కల్యాణ్ పేరుతో రూ. లక్షా 70 వేల కోట్లతో భారీ ఆర్ధిక ప్యాకేజీ ప్రకటించింది. పేదలు రోజువారీ కూలీల కోసం కేంద్రం ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. లాక్‌డౌన్ కారణంగా దేశంలో ఆకలి చావులు లేకుండా కేంద్రం అన్ని ఏర్పాట్లు చేసిందనీ.. పేదలకు నేరుగా సాయం అందేలా చర్యలు తీసుకుంటామని నిర్మల ప్రకటించారు.

రోనా రోగులకు చికిత్స అందిస్తున్న వైద్యులు, పారామెడికల్ సిబ్బంది, పారిశుద్ధ్యం సిబ్బందికి రూ.50 లక్షల మేర హెల్త్ ఇన్సూరెన్స్ కల్పించనున్నట్టు పేర్కొన్నారు. 80 కోట్ల మంది పేద ప్రజలకు ఇప్పుడిస్తున్న రూ.5 కేజీల బియ్యం, గోధుమలకు అదనంగా మరో 5 కేజీలు ఉచితంగా అందిస్తామని నిర్మల పేర్కొన్నారు. ఇప్పుడిస్తున్న 1 కేజీ పప్పు ధాన్యాలకు అదనంగా మరో కేజీ పప్పు ధాన్యాలు ఇస్తామన్నారు.

రైతులకు 2000 రూపాయిలు, ఇప్పటివరకు పెన్షన్లు వస్తున్న వారికి 2000 రూపాయల ఎక్స్-గ్రేషియా, ఉపాధి హామీ కార్మికులకు వేతనాలు పెంచడం, జన్ ధన్ అకౌంట్లు కలిగిన మహిళలకు 500 రూపాయిలు, పేదకు మూడు నెలల పాటు ఉచిత గ్యాస్ సీలిండర్లు కూడా ప్రకటించింది.

డ్వాక్రా మహిళల గ్రూపులకు ఇచ్చే వడ్డీ లేని లోన్లు 10 లక్షల నుండి 20 లక్షలకు పెంచారు. 15000 వేతనాలు వచ్చే కార్మికులు 100కు పైగా ఉండే కంపెనీలలో 24% పీఎఫ్ ప్రభుత్వమే చెల్లించనుంది. భవన నిర్మాణ కార్మికులకోసం రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికే 31,000 కోట్ల నిధిని వాడుకునే అవకాశం కూడా కేంద్ర కల్పించింది.