Film industry still seems to be learning lessonsకరోనా సెకండ్ వేవ్ ప్రభావం కొంత తగ్గినట్టు అనిపించడంతో తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో షూటింగుల సందడి మొదలైపోయింది. జులై మొదటి రెండో వారంలో మొత్తం అన్ని సినిమాలు పట్టాలెక్కుతాయి. ప్రమాదం ఇంకా ముగిసిపోలేదని… థర్డ్ వేవ్ వచ్చే ప్రమాదం కూడా ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

అయితే ఇండస్ట్రీ మాత్రం ఇంకా పాఠాలు నేర్చుకోలేనట్టుగానే కనిపిస్తుంది. అయితే ఒక స్టార్ సినిమా దాదాపుగా 300 మందితో జులై 5 నుండి మొదటి షెడ్యూల్ ప్లాన్ చేస్తుందని సమాచారం. సదరు సినిమా సెకండ్ వేవ్ లో కేసులు పెరుగుతున్నా ఆపకుండా షూట్ చేసింది. చిత్ర యూనిట్ లో కొందరు కరోనా వచ్చినా షూటింగ్ ఆపలేదు.

చివరికి హీరోకి వస్తే గానీ పట్టించుకోలేదు. ఇప్పుడు కూడా అదే నిర్లక్ష్యం… పరిస్థితి అదుపులోకి వచ్చేవరకు యాభై మందితోనే షూట్ చేసుకోవాలని అంటున్నా నిర్లక్ష్యమే. ఆ నిర్లక్ష్యం మొత్తానికే నష్టం చేసి మళ్ళీ ఇండస్ట్రీని మూసివేసే పరిస్థితి రావొచ్చు. అంతేందుకు వారికి కూడా అది ప్రమాదమే.

అయితే ఈ నిర్లక్ష్యం అన్ని చోట్లా ఉందని అంటున్నారు. మాస్కులు పెట్టుకోకుండా సామాజిక దూరం పాటించకుండా ఇష్టం వచ్చినట్టు షూటింగులు చేస్తున్నారట. వ్యాక్సిన్ వేయించుకున్నారా అని మాట వరసకు అడుగుతున్నారు గానీ వ్యాక్సిన్ సర్టిఫికెట్ ని చెక్ చేసుకుని కట్టుదిట్టంగా ప్లాన్ చేస్తున్న నిర్మాతలే అరుదుగా ఉంటున్నారట.

కరోనా కారణంగా బాగా దెబ్బపడిన రంగాలలో సినీ రంగం ఒకటి అయినా బాధ్యతతో మెలగకపోతే ఇక ఏమనుకోవాలి?