Fidaa movie TRP Ratingsమెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, సాయి పల్లవి జంటగా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వఛ్చిన ఫిదా చిత్రం ఎంతటి ఘన విజయం సాధించిందో మన అందరికి తెలిసిందే. ఆ చిత్రం 45 కోట్లకు పైగా షేర్ రాబట్టింది. ఆ చిత్రం టీవీలో కూడా అదే స్థాయిలో ఇరగదీసింది. మొదటిసారి సినిమా టెలికాస్ట్ అయినప్పుడు 21.6 టీఆర్పీ రేటింగ్స్ సాధించింది.

అప్పట్లో ఇదొక సెన్సేషన్. అయితే రెండో టెలికాస్ట్ లో 18.58 టీఆర్పీ రేటింగ్స్ సాధించింది. చాలా పెద్ద సినిమాల మొదటి టెలికాస్ట్ లో కూడా ఇలాంటి రేటింగ్స్ రావు. కనుక ఇదొక పెద్ద సెన్సేషన్ అనే చెప్పుకోవాలి. ఈ చిత్రం హక్కులు పొందిన మా టీవీ ఆనందానికి అవధులు లేవు అట.

దిల్ రాజు నిర్మించిన ఈ చిత్రం అందరికి భారీ లాభాలు సాధించి పెట్టింది. ఎన్నేళ్లగాను సరైన హిట్ కోసం ఎదురు చూస్తున్న వరుణ్ తేజ్ కు ఒకింత ఊరటను ఇచ్చింది. అదే విధంగా వరుస పరాజయాలతో సతమతం అవుతున్న శేఖర్ కమ్ముల కూడా భారీ హిట్ తో తిరిగి ఫామ్ లోకి వచ్చినట్టు అయ్యింది.