Fida, Fida Telugu Movie Details, Fida Telugu Movie Updates, Fida Telugu Movie News, Fida Telugu Movie Latest Updates, Fida Telugu Movie Infoచాలా కాలం తర్వాత మెగా ఫోన్ పట్టుకున్న ‘క్లాస్’ చిత్రాల దర్శకుడు శేఖర్ కమ్ముల, తన సినిమా టైటిల్ ని “ఫిదా”గా ప్రకటించిన విషయం తెలిసిందే. మెగా వారసుడు వరుణ్ తేజ్, సాయి పల్లవి హీరోహీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాను సక్సెస్ ఫుల్ నిర్మాత దిల్ రాజు ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమా టైటిల్ ఆవిష్కరణతో పాటు ఫస్ట్ లుక్ పోస్టర్ ను కూడా విడుదల చేసింది.

సాధారణంగా శేఖర్ కమ్ముల సినిమా టైటిల్స్ అన్ని ‘క్లాస్’ జోనర్లోనే ఉంటాయి. కానీ, వరుణ్ తేజ్ టైటిల్ మాత్రం మాస్ అప్పీల్ ఇచ్చే విధంగా ‘ఫిదా’ అని నామకరణం చేయడం విశేషం. అయితే విడుదల చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్ మాత్రం పక్కా క్లాస్ లుక్ లో, శేఖర్ కమ్ముల అభిరుచికి తగిన విధంగా దర్శనమిస్తోంది. ‘లవ్ – హేట్ – లవ్ స్టోరీ’ అంటూ ట్యాగ్ లైన్ ఉన్న ఈ సినిమా పోస్టర్ వీక్షకులను ఆకర్షిస్తోంది.