Farah Khan Sensational Comments on Tv shows ‘ఝలక్‌ దిఖ్‌ లాజా’ రియాలిటీ డ్యాన్స్ షోకు జడ్జిగా వ్యవహరిస్తున్న మహిళా దర్శకురాలు ఫరా ఖాన్.. సల్మాన్, షారూఖ్ ఖాన్ లపై సంచలన వ్యాఖ్యలు చేసారు. ‘ఝలక్ దిఖ్ లాజా’ షో ప్రమోషన్ సందర్భంగా పాల్గొన్న ఫరా మాట్లాడుతూ… ఈ షోకి తనతో పాటు కరణ్‌ జోహార్‌ న్యాయనిర్ణేతగా వ్యవహరిస్తున్నాడని, కరణ్‌ అయితే జడ్జిగా కరెక్ట్‌ గా వ్యవహరిస్తాడని పేర్కొంది. అదీ కాకుండా ఈ షోలో కరణ్‌ ఉంటే బాగా ఎంజాయ్‌ చేయవచ్చని కితాబునిచ్చింది.

కరణ్ కంటే సల్మాన్‌, షారుక్‌ లు జడ్జిలుగా వ్యవహరిస్తే మరింత స్టార్ డమ్ ఉంటుంది, అలాగే షోకి మరింత ప్రచారం వస్తుంది కదా? అన్న ప్రశ్నకు సమాధానమిస్తూ… షారుక్‌ జడ్జిగా అసలు పనికి రాడని మొహమాటం లేకుండా చెప్పేసింది. షారూక్ ఎవరి పర్ఫార్మెన్స్‌ చూసినా బాగుందని చెబుతూ ఫుల్‌ మార్కులు వేసేస్తాడని, అది షారుక్ వీక్ నెస్ గా చెప్పుకొచ్చింది. అదే సల్మాన్‌ ఖాన్ అయితే నిజాయతీగా ఉంటాడని, ఎవరి పర్ఫార్మెన్స్ చూసినా తన కంటే గొప్పగా డాన్స్ చేశారని ఫీలవుతాడని అంది.

అందుకే స్టార్ డం ఉన్నా కూడా వీరిద్దరూ జడ్జిమెంట్ కి అసలు పనికి రారని, తాను, కరణ్ మాత్రమే సరిగ్గా జడ్జ్ చేయగలమన్న విషయాన్ని చెప్పకనే చెప్పింది. దర్శకురాలు ఫరాతో ఆ ఇద్దరూ స్టార్ హీరోలతో ఉన్న చనువు వలనే ఈ కామెంట్స్ చేసిందని, అయినా ఫరా చేసిన కామెంట్స్ తో సల్మాన్, షారుక్ లు సైతం అంగీకరిస్తారని, బాలీవుడ్ వర్గాలు చెప్తున్నాయి.