fans worried about rajamouli mahesh babu movie“ఆర్ఆర్ఆర్” సినిమా కోసం సినీ ప్రేక్షకులందరూ నిరీక్షిస్తున్న తరుణంలో… ఈ సినిమా ప్రమోషన్స్ మహేష్ బాబు అభిమానులకు మాత్రం వరంలా మారాయి. ‘ఆర్ఆర్ఆర్’ ప్రమోషన్స్ కు ముందు వరకు మహేష్ – రాజమౌళి కాంబో సినిమాకు సంబంధించిన ఏ విషయం బయటకు రాకపోగా, లేటెస్ట్ ప్రమోషన్స్ లో ఒక్కొక్కటిగా బయటకు రావడం ఫ్యాన్స్ కు అమితానందానికి గురి చేస్తోంది.

తొలుత ఈ సినిమా మల్టీస్టారర్ గా ప్రచారం జరగడంతో, మీడియా వర్గాలు జక్కన్నను ఈ ప్రశ్న అడిగారు. మల్టీస్టారర్ కాదు, మహేష్ ఒక్కడే హీరో అని చెప్పడంతో పండగ చేసుకున్న ఫ్యాన్స్ కు మరో తీపికబురును అందించారు జక్కన్న. బాలీవుడ్ మీడియాలో మహేష్ సినిమాతో చేయబోతున్న కధ గురించి ఓ రెండు, మూడు ప్రశ్నలు దర్శకధీరుడికి ఎదురయ్యాయి.

ఒక రెండు, మూడు లైన్స్ అయితే ఉన్నాయి గానీ, ఇప్పటివరకు ఏది ఫైనల్ కాలేదని రాజమౌళి స్పష్టం చేయగా, ఈ సినిమా భారీ స్కేల్ లో ఉండబోతోందా? లేక చిన్నదిగా ఉండబోతోందా? అంటే ఖచ్చితంగా భారీ స్కేల్ లోనే అని చెప్పి జక్కన్న నవ్వేసారు. మహేష్ మూవీ గురించి రాజమౌళి చేసిన ఈ కామెంట్స్ తో మహేష్ ఫ్యాన్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో రచ్చ చేస్తున్నారు.

అయితే భారీ బడ్జెట్ అంటే మరో రెండు, మూడేళ్ళ పాటు మహేష్ డేట్స్ ను జక్కన్న తీసేసుకుని, అభిమానులను దూరం చేస్తారని, మరో మూవీ చేయనివ్వకుండా చేస్తారన్న అపవాదు కూడా ఉంది. “ఆర్ఆర్ఆర్” విషయంలో రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ లు ఇలాగే అయ్యి, మూడేళ్ళుగా ఒక్క రిలీజ్ కూడా లేకుండా ఉన్నారని అభిప్రాయపడ్డారు.

‘ఆర్ఆర్ఆర్’ విషయానికి వచ్చేపాటికి కరోనా ప్రధాన శత్రువు కాగా, ఇప్పుడు ఆ ఉధృతి తగ్గగా, పరిస్థితి ఇలాగే కొనసాగితే, ‘ఆర్ఆర్ఆర్’ అంత సమయం మహేష్ సినిమాకు తీసుకోకపోవచ్చన్న టాక్ కూడా ట్రేడ్ వర్గాలలో హల్చల్ చేస్తోంది. ఏది ఏమైనా మరో భారీ చిత్రానికి రాజమౌళి ఆలోచనలు చేయడం నిజంగా మహేష్ అభిమానులకు పండగలా మారింది.