fans--disappointed-with-pawan-kalyan-attitudeజనసేన పార్టీ 2019 ఎన్నికలలో ఆంధ్రప్రదేశ్ లో కేవలం ఒక్కటంటే ఒక్కటే సీటులో గెలిచింది. పవన్ కళ్యాణ్ సైతం తాను పోటీ చేసిన రెండు సీట్లో ఓడిపోయారు. అలాగే తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికలలో కొన్ని చోట్ల పోటీ చేశారు. అక్కడకు పవన్ ప్రచారానికి కూడా వెళ్ళలేదు. అన్ని చోట్ల డిపాజిట్లు కోల్పోయారు ఆ పార్టీ అభ్యర్థులు.

పార్టీ ఓటమికి ప్రధాన కారణం పవన్ కళ్యాణ్ రాజకీయాల పట్ల సీరియస్ కాదు అనే సంకేతం ప్రజలలోకి వెళ్లడమే. అది మార్చుకోవాల్సింది పోగా పవన్ కళ్యాణ్ మరింతగా ఆ భావన పెంచుతున్నారు. తెలంగాణలో జరుగుతున్న జీహెచ్ఎంసి ఎన్నికల నోటిఫికేషన్ వచ్చింది. ఎన్నికలలో పోటీ చేస్తున్నట్టుగా జనసేన ప్రకటించింది.

20వ తారీఖు నామినేషన్ల చివరి తేదీ. పార్టీలన్నీ తమ అభ్యర్థులను ఫైనల్ చేసే పనిలో ఉన్నాయి. అయితే పవన్ కళ్యాణ్ మాత్రం మంగళగిరిలో ఆంధ్రప్రదేశ్ రాజకీయాల మీటింగులలో బిజీగా ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ లో ఏమైనా కీలక రాజకీయ పరిణామాలు జరుగుతున్నాయా అంటే అదీ లేదు. నిజంగా కీలక పరిణామాలు జరుగుతునప్పుడు పవన్ హైదరాబాద్ లోని తన ఫామ్ హౌస్ లోనే ఉండిపోయారు.

సహజంగానే ఆంధ్ర పార్టీ అనే ముద్ర ఉంటుంది జనసేన పైన, ఇటువంటి తరుణంలో ఆంధ్రలో కూర్చుని తెలంగాణలో ఎన్నికలకు వెళ్తాము అంటే ఎవరు నమ్ముతారు? ఇటువంటి పరిస్థితులలో పోటీ చేసి ఏం ఉపయోగం ఉంటుంది? మరోవైపు… జీహెచ్ఎంసి ఎన్నికల నుండి తప్పుకోమని జనసేనకు బీజేపీ నుండి ఒత్తిడి కూడా గట్టిగా వస్తుందని సమాచారం.