fans disappointed on rajinikanth politicsచెన్నైలోని హోటల్ లీలా ప్యాలెస్ లో ప్రెస్ మీట్ నిర్వహించిన సూపర్ స్టార్ రజినీకాంత్ తన రాజకీయ భవిష్యత్తు గురించి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. తన రాజకీయ రంగ ప్రవేశం గురించి 15 ఏళ్లుగా చర్చ జరుగుతోందన్నారు. ఐతే ఎప్పుడు రావాలో.. ఎలా రావాలో తనకు తెలుసన్నారు. త్వరలోనే పార్టీ పేరు ప్రకటిస్తానని స్పష్టం చేశారు తలైవా.

అంతే కాదు తమిళనాడుకు ముఖ్యమంత్రి కావాలన్న ఆసక్తి తనకు లేదని స్పష్టం చేశారు. అన్ని అర్హతలు ఉన్న వ్యక్తినే ముఖ్యమంత్రి పీఠం కూర్చోబెడతానన్నారు. రాష్ట్రానికి అభివృద్ధి జరగాలంటే బాగా చదువుకున్న వ్యక్తి సీఎంగా ఉండాలని తెలిపారు. తాను మాత్రం కేవలం ప్రభుత్వాన్ని ప్రశ్నించడానికే పరిమితం అవుతానని, తన పార్టీ అధ్యక్షుడిగా మాత్రమే ఉంటా అని చెప్పుకొచ్చారు.

అయితే ఈ ప్రకటనపై రజినీకాంత్ అభిమానులలో సైతం నిరాశ ఆవహించింది. “ప్రాంతీయ పార్టీలలో నాయకుడి మొహం చూసే ఓట్లు వేస్తారు. నాయకుడిని ముఖ్యమంత్రిని చెయ్యడానికే ఓట్లు పడతాయి. అటువంటిది ఎవరినో ముఖ్యమంత్రిని చేస్తా అంటే ఎవరు ఓట్లు వేస్తారు? ఇది రాంగ్ స్టెప్,” అని వారు బాహాటంగానే విమర్శిస్తున్నారు.

ఇది ఇలా ఉండగా ఇప్పటికీ రజినీకాంత్ తన రాజకీయ పార్టీ పేరుని గానీ ఎప్పుడు ప్రకటించేదీ ప్రస్తావించకపోవడం విశేషం. మరోవైపు తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు వచ్చే ఏడాది జరగనుండగా రజినీకాంత్ వరుసగా సినిమాలు సైన్ చేస్తూ పోవడం విశేషం. దీనితో రాజకీయాలపై రజినీకాంత్ సీరియస్ నెస్ మీదే అనుమానాలు వస్తున్నాయి.