fan Misbehaves With Tabu At Jodhpur Airport-బాలీవుడ్ హీరోయిన్ టబుకు జోధ్ పూర్ ఎయిర్ పోర్టులో చేదు అనుభవం ఎదురైంది. 1998లో ‘హమ్‌ సాథ్‌ సాథ్‌ హై’ సినిమా షూటింగ్ సందర్భంగా ప్రముఖ నటుడు సల్మాన్ ఖాన్ కృష్ణ జింకను వేటాడిన కేసు విచారణకు టబు హాజరైంది. ఈ సంఘటనలో సల్మాన్ తో పాటు ఉన్నందుకు సైఫ్ అలీఖాన్, సోనాలీ బింద్రే, టబులకు కూడా జోధ్ పూర్ న్యాయస్థానం సమన్లు జారీ చేసిన సంగతి తెలిసిందే.

ఈ కేసు విచారణ ఇంచుమించు పూర్తయింది, తీర్పు కూడా రేపు రానుంది. ఈ క్రమంలో విచారణకు హాజరైన టబు తిరిగి వెళ్లేందుకు జోధ్ పూర్ ఎయిర్ పోర్టుకు చేరగా, ఒక అభిమాని సెక్యూరిటీని దాటుకుని మరీ ఆమె వద్దకు వచ్చి అసభ్యంగా ప్రవర్తించాడు. వెంటనే అక్కడ ఉన్న బౌన్సర్లు అతన్ని పక్కకు లాగిపడేశారు. దీంతో టబు చాలా ఇబ్బంది పడ్డారని, దీనిపై కేసుపెట్టే అవకాశం ఉందని బాలీవుడ్ వర్గాలు పేర్కొంటున్నాయి.