Famous Person Death in Akhanda Theatreఎంతో ఉత్సాహంతో “అఖండ” సినిమా వీక్షిస్తోన్న తూర్పు గోదావరి జిల్లా సినీ ఎగ్జిబ్యూటర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు జాస్తి రామకృష్ణ మరణించారు. 49 ఏళ్ళ రామకృష్ణ “వింటేజ్ క్రియేషన్స్” అధినేతగా, సినీ ఎగ్జిబిటర్ గా జిల్లాలో సినీ వర్గాలకు సుపరిచితం.

‘అఖండ’ సినిమా ఇంటర్వెల్ సమయంలో తన సన్నిహితులతో మాట్లాడుతుండగా, బ్రెయిన్ స్ట్రోక్ వచ్చి హఠాత్తుగా నేలకొరిగారు. ఖంగుతిన్న సన్నిహితులు వెంటనే హాస్పిటల్ కు తీసుకువెళ్లగా, మార్గమధ్యంలోనే చనిపోయినట్లుగా వైద్యులు ఖరారు చేసారు.

‘వింటేజ్ క్రియేషన్స్’ అధినేతగానే కాకుండా, రాజమహేంద్రవరం సమీపంలోని నామవారం వీఎస్ మహల్ ధియేటర్ ను కూడా రన్ చేస్తున్నారు. ‘అఖండ’ ధియేటర్ లో జరిగిన ఈ సంఘటన స్థానిక అభిమానులను కూడా కలిచివేసింది. ఈ సందర్భంగా జాస్తి రామకృష్ణ గారి ఆత్మకు శాంతి చేకూరాలని ఆశిద్దాం.