Fakhar Zaman  fastest to score 1000 ODI runsవన్డే క్రికెట్ ఫార్మాట్ లో సరికొత్త రికార్డులు బద్దలవుతున్నాయి. ఇటీవల మొదటి వికెట్ కు 304 పరుగుల భాగస్వామ్యం అందించి రికార్డులకెక్కిన పాకిస్తాన్, తాజాగా మరో రికార్డును కైవసం చేసుకుంది. ఆ రికార్డ్ ఓపెనింగ్ లో డబుల్ సెంచరీ (210)తో కదం తొక్కిన ఫఖర్ జామన్, తాజా మ్యాచ్ లో 29 పరుగులకు చేరుకోగానే అతి తక్కువ మ్యాచ్ లలో 1000 పరుగులు సాధించిన బ్యాట్స్ మెన్ గా సరికొత్త రికార్డును కైవసం చేసుకున్నాడు.

18 మ్యాచ్ లలోనే 1000 పరుగులు పూర్తి చేసిన ఫఖర్ ఖాతాలో ఇప్పటివరకు 3 సెంచరీలు ఉండగా, అందులో ఒకటి డబుల్ సెంచరీ కావడం విశేషం. అలాగే 5 హాఫ్ సెంచరీలు కూడా సాధించి పాకిస్తాన్ కు ఓ సాలిడ్ బ్యాట్స్ మెన్ గా నిలుస్తున్నాడు. బ్యాటింగ్ విభాగంలో వన్డే క్రికెట్ లో ఎప్పటికప్పుడు రికార్డులు బద్ధలవుతూ ఉండడం వీక్షకులకు ఆనందదాయకమే! అయితే అతి తక్కువ రికార్డులు గల పాకిస్తాన్ ఖాతాలో ఇవి చేరడం చెప్పుకోదగ్గ విషయం.