fahadh faasil - pushpa villainస్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ పుష్పలో మలయాళీ పవర్ హౌస్, ఫహద్ ఫాసిల్ ప్రధాన విలన్ గా కనిపించనున్నాడు . ఫహద్ ఈ తరం యొక్క అద్భుతమైన యాక్టర్ గా ప్రసిద్ది చెందాడు. ఈ చిత్రానికి అతని కాస్టింగ్ అద్భుతంగా పని చేస్తుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు. అతను చేసిన విభిన్న పాత్రల కారణంగా దేశవ్యాప్తంగా ఫేమస్ ఫేస్ ఆయన.

లాక్ డౌన్ సమయంలో భాషాబేధం లేకుండా ఆయన సినిమాలను దేశవ్యాప్తంగా విస్తృతంగా చూశారు. ఫహద్ ఇందులో నటిస్తున్నారనే కారణంతో సినిమా చూసే ప్రేక్షకులు కూడా ఉంటారు. మరీ ముఖ్యంగా తమిళం, మలయాళంలో సినిమా మార్కెట్ బాగా పెరుగుతుంది. కాబట్టి, ఇది అద్భుతమైన ఎంపిక అనే చెప్పాలి.

ఇది పాన్-ఇండియా ప్రాజెక్ట్ గా ఈ చిత్రానికి చాలా విలువను ఇస్తుంది. సూపర్ ప్లాన్నింగ్ తో మరోసారి బన్నీ దుమ్ము రేపాడు. స్వాతంత్య్ర దినోత్సవ స్పెషల్‌గా ఆగస్టు 13 విడుదల కోసం పుష్పను సిద్ధం చేస్తున్నారు. సుకుమార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో రష్మిక కథానాయికగా నటిస్తోంది. దేవి శ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి సంగీతం సమకూర్చుతున్నారు.

ఈ సినిమాలో బన్నీ చిత్తూరు జిల్లా యాసలో మాట్లాడబోతున్నాడు. చిత్తూర్ జిల్లా శేషాచలం అడవులలో జరిగే ఎర్రచందనం స్మగ్లింగ్ ఆధారంగా ఈ సినిమా ఉంటుందని సమాచారం. అల్లు అర్జున్ గత ఏడాది ఆరంభంలో తన అల వైకుంఠపురంలో సూపర్ సక్సెస్ తర్వాత ఈ సినిమా ని అంతకంటే పెద్ద రేంజ్ కి తీసుకుని వెళ్ళాలని ఆసక్తిగా ఉన్నాడు