F3 Telugu Movie Digital rightsఅత్యంత విజయవంతమైన ఎఫ్2 సినిమా కు సెకండ్ పార్ట్ గా వస్తున్న సినిమా ఎఫ్3. గత ఏడాది చివర్లో సెట్స్ మీదకు వెళ్లిన ఈ సినిమా ఆగష్టు 27న ప్రేక్షకుల ముందుకు రాబోతుందని ఇప్పటికే నిర్మాతలు కంఫర్మ్ చేశారు. ఈ సినిమాలు అటుఇటుగా యాభై కోట్ల బడ్జెట్ పెడుతున్న దిల్ రాజు ఇప్పటికే సగం రికవర్ చేసేశారట.

ఈ సినిమాకు సంబంధించిన డిజిటల్ రైట్స్ ను అమెజాన్ ప్రైమ్ 12 కోట్లకు కైవసం చేసుకుందట. అలాగే సాటిలైట్ రైట్స్ జీ తెలుగు కు కంఫర్మ్ అయ్యాయట. దానికోసం ఆ సంస్థ దిల్ రాజు కు మరో 12 కోట్లు చెల్లించిందట. అంటే 24 కోట్లు ఇక్కడే రికవర్ అయిపోయింది. ఎఫ్2 ఫ్రాంచైజ్ మీద ఉన్న క్రేజ్ కు ఇది నిదర్శనం అని చెప్పుకోవచ్చు.

షూటింగ్ సగం కూడా పూర్తి కాకముందే సగం రికవరీ అయిపోయినట్టు అయ్యింది. తమన్నా మరియు మెహ్రీన్ కూడా ఈ రెండవ భాగంలో ఉంటారు. ఈ సినిమా హాస్యనటుడు సునీల్ వెంకటేష్, వరుణ్ తేజ్ లతో చేరి సందడి చెయ్యబోతున్నాడు. ఎఫ్2 పెళ్లి అనే కాన్సెప్ట్ మీద నడపగా ఎఫ్3 మాత్రం డిఫరెంట్ కాన్సెప్ట్ అని దర్శకుడు ఇప్పటికే చెప్పాడు.

తన కెరీర్‌లో ఇప్పటివరకు ఒక్క ఫ్లాప్ కూడా లేని అతికొద్ది మంది దర్శకులలో అనిల్ రావిపుడి ఒకరు. ఎఫ్ 2 అప్పటికి అతని కెరీర్ లో భారీ హిట్. ఆ తరువాత మహేష్ బాబు తో సరిలేరు నీకెవ్వరూ తో 100 కోట్ల షేర్ సినిమా కూడా ఇచ్చాడు అనిల్. చాలా కాలం తరువాత ఎఫ్2లో వెంకటేష్ కామెడీ ఇరగదీశాడు. కాబట్టి ఈ సీక్వెల్ ప్రాజెక్ట్ పై హైప్ మరియు అంచనాలు ఎక్కువగా ఉన్నాయి.