f2-working-stills-venkatesh-varun-tejకమర్షియల్ గా వరుస సక్సెస్ లను కొడుతోన్న అనిల్ రావిపూడి దర్శకత్వంలో విక్టరీ వెంకటేష్ – వరుణ్ తేజ్ లతో ఇటీవల “ఎఫ్ 2 ఫన్ అండ్ ఫ్రస్ట్రేషన్” అనే మల్టీస్టారర్ ప్రారంభమైన విషయం తెలిసిందే. గురువారం నాటితో ఈ సినిమా మొదటి షెడ్యూల్ పూర్తి చేసుకుందని దర్శకుడు అనిల్ రావిపూడి తన ట్విట్టర్ ఖాతాలో రెండు ఫోటోలను పోస్ట్ చేస్తూ ఖరారు చేసారు.

ఈ పిక్స్ లో ఫన్ కురిపించే విధంగా విక్టరీ వెంకటేష్ కనిపించగా, ఫ్రస్ట్రేషన్ లో ఉన్నట్లుగా వరుణ్ తేజ్ విక్టరీ వైపు చూస్తున్నారు. అలాగే మరో ఫోటోలో అనిల్ రావిపూడి తీసుకున్న సెల్ఫీలో వెంకటేష్ తో పాటు హీరోయిన్లు తమన్నా, మెహ్రీన్ లు కనిపించారు. పిక్స్ లో కనపడుతోన్న జోరు, హుషారును చూస్తుంటే అనిల్ రావిపూడి మరో కమర్షియల్ సక్సెస్ కు బాటలు వేస్తున్నట్లే కనపడుతున్నాడు.