Varun Tej - Venkatesh - Mehrene Kaur Pirzada-Tammannah Bhatia.jpgసక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో విక్టరీ వెంకటేష్ – వరుణ్ తేజ్ లు హీరోలుగా తెరకెక్కుతున్న “ఎఫ్ 2” ‘ఫన్ అండ్ ఫ్రస్ట్రేషన్’ షూటింగ్ ప్రస్తుతం విదేశాలలో తెరకెక్కుతోంది. చిత్ర తారాగణం అంతా పాల్గొన్న ఈ షెడ్యూల్ నుండి ఓ పిక్ ను దర్శకుడు అనిల్ రావిపూడి సోషల్ మీడియాలో రిలీజ్ చేసారు.

చెక్ రిపబ్లిక్, పరుగ్వేలో పూర్తి స్థాయి ఫన్ తో ఈ సినిమా షూటింగ్ జరుపుకుంటోందని ఈ పిక్ చెప్పకనే చెప్తోంది. దర్శకుడు అనిల్ రావిపూడితో పాటు హీరోలు వెంకటేష్, వరుణ్ లు, హీరోయిన్లు తమన్నా, మేహ్రీన్ లు పాల్గొన్న ఈ పిక్ సినీ అభిమానుల మెప్పు పొందుతోంది. అందరూ కామన్ గా బ్లాక్ కలర్ కాస్ట్యూమ్స్ ను ధరించారు.