F2 movie Sequelరిటర్న్ అఫ్ ఇన్వెస్ట్మెంట్ బట్టి చూస్తే ఎఫ్ 2 ఈ ఏడాది అతిపెద్ద హిట్ అని చెప్పుకోవాలి. వెంకటేష్, వరుణ్ తేజ్ నటించిన ఈ చిత్రం సంక్రాంతికి విడుదలై దుమ్ము దులిపింది. సంక్రాంతికి విడుదలైన ఎన్టీఆర్ మహానాయకుడు, వినయ విధేయ రామ చిత్రాలంటే బెటర్ గా ప్రేక్షకుల ఆదరణ పొంది 80 కోట్ల పైగా షేర్ కలెక్టు చేసింది.

మరోవైపు చిత్రంలోనే ఎఫ్ 2కి సీక్వెల్ గా ఎఫ్ 3 తీయబోతున్నట్టు చిత్ర బృందం ప్రకటించింది. అందులో రవితేజ నటించవచ్చని అప్పట్లో వార్తలు వచ్చాయి. దానిని ఇప్పటివరకు అధికారికంగా ధృవీకరించలేదు. అయితే వచ్చే సంవత్సరం ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్తుందని వార్తలు వస్తున్నాయి.

వెంకటేష్ వచ్చే ఏడాది అసురన్ రీమేక్ షూటింగ్ మొదలు పెడతారు. ఆ సినిమా పూర్తి అవ్వగానే ఎఫ్ 3 మొదలు అవుతుంది. 2021 సంక్రాంతికి ఈ సినిమా విడుదలకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. అనిల్ రావిపూడి తాజా చిత్రం మహేష్ బాబు నటించిన సరిలేరు నీకెవ్వరూ సంక్రాంతికి విడుదల అవుతుంది.

ఆ సినిమా హడావిడి సద్దుమణిగిన వెంటనే అనిల్ ఎఫ్3 పనులు మొదలు పెడతాడు. ఎఫ్3 చిత్రానికి ట్రేడ్ లో ఎక్కడలేని హైప్ ఉంటుంది అనడంలో ఎటువంటి అనుమానం లేదు. ఈ సినిమా కోసం వెంకటేష్ తరుణ్ భాస్కర్ తో చెయ్యాల్సిన సినిమాను కూడా వాయిదా వేసుకోబోతున్నారట.