F2 - Fun and Frustration Television- (2)ఈ సంవత్సరం తెలుగులో సూపర్ హిట్టైయిన తొలి చిత్రం, ఎఫ్ 2. వెంకటేష్, వరుణ్ తేజ్ హీరోలుగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం సంక్రాంతి కానుకగా విడుదలై సంచలన విజయం సాధించింది. అంతేకాదు 80 కోట్ల షేర్‌ తో ఈ సినిమా ట్రేడ్ లో ఉన్న వారందరికీ భారీ లాభాలు తెచ్చిపెట్టింది. సినిమా ప్రారంభం నుంచి లాస్ట్ షాట్ వరకు ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించడంలో అనిల్ రావిపూడి సక్సెస్ అవ్వటం కలిసివచ్చింది. ఈ సినిమాకి టీవీ ఆడియన్స్ కూడా బాగా కనెక్టయినట్టు ఉన్నారు.

స్టార్ మా ఛానల్ దగ్గర ఈ సినిమా రైట్స్ ఉన్నాయి. ఇప్పటివరకూ రెండు సార్లు టీవీలో ప్రసారం అయ్యింది. రెండు సార్లూ మంచి రేటింగ్స్ వచ్చాయి. సహజంగా మొదటి రెండు ప్రసారాల తరువాత సినిమా రేటింగ్స్ తగ్గుతాయి. కాకపోతే ఎఫ్ 2 కథే వేరు. ఇటీవలే మూడోసారి ప్రసారమైన ఈ సినిమా 9.6 రేటింగ్స్ వచ్చాయి. అదే వారంలో మొదటి సారి ప్రసారమైన నాని జెర్సీ సినిమాకు కేవలం 8.8 రేటింగ్స్ రావడం విశేషం. దీని బట్టి ఫ్యామిలీ ఆడియన్స్ ఎఫ్ 2 తో ఎంత బాగా కనెక్టు అయ్యారో చెప్పవచ్చు.

మరోవైపు తెలుగులో బంపర్ హిట్టైన ఈ సినిమాను హిందీలో రీమేక్ ప్లాన్ చేసారు. హిందీలో ఈ సినిమాను బోనీ కపూర్‌తో కలిసి దిల్ రాజు నిర్మిస్తున్నాడు. హిందీలో కామెడీ సినిమాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారిన అనీస్ బజ్మీ ఈ సినిమాను డైరెక్ట్ చేస్తున్నాడని వినికిడి. అయితే ఈ సినిమాలో ఎవరు నటిస్తున్నారు అనేది ఇంకా తేలాల్సి ఉంది. కామెడీ అనేది యూనివర్సల్ సబ్జెక్టని, హిందీ ప్రేక్షకులు కూడా దీనికి తప్పకుండా కనెక్టు అవుతారని దిల్ రాజు గట్టి నమ్మకం. చూడాలి ఏమవుతుందో!