f2-fun-and-frustration-first-look-on-diwaliవిక్టరీ వెంకటేష్ మరియు మెగా హీరో వరుణ్ తేజ్ లు కలిసి చేస్తోన్న “ఎఫ్ 2” (ఫన్ అండ్ ఫ్రస్ట్రేషన్) సినిమా ఫస్ట్ లుక్ విడుదలకు ముహూర్తాన్ని ఖరారు చేసారు. సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమా ఫస్ట్ లుక్ ను ఈ దీపావళి సందర్భంగా విడుదల చేయనున్నారు.

ప్రస్తుతం బ్యాంకాక్ లో షూటింగ్ జరుగుతోన్న ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి పర్వదినం కానుకగా విడుదల కానుంది. ఏస్ ప్రొడ్యూసర్ దిల్ రాజు నిర్మిస్తోన్న ఈ సినిమాలో వెంకటేష్ కు జతగా మిల్కీ బ్యూటీ తమన్నా నటిస్తుండగా, వరుణ్ తేజ్ సరసన మేహ్రీన్ కన్నులవిందు చేయనుంది.

ఈ దీపావళి ‘ఎఫ్ 2’ ఫస్ట్ లుక్ తో పాటు మెగా అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న బోయపాటి – రామ్ చరణ్ ల సినిమా టైటిల్ తో పాటు ఫస్ట్ లుక్ ను కూడా విడుదల చేయనున్నారు. ‘వినయ విదేయ రామ్’గా హల్చల్ చేస్తోన్న టైటిల్ దివాలి నాడు అఫీషియల్ కానుండగా, ఈ సినిమాలో చెర్రీ సరసన కీయరా అద్వానీ నటిస్తోంది.