F2 Fun And Frustration Diwali Poster talk
మల్టీస్టారర్ సినిమాలంటే తెలుగు ప్రేక్షకులు బాగా కిక్. అయితే అన్ని మల్టీస్టారర్లు ప్రేక్షకులు ఊహించినంత రేంజ్ లో అయితే ఉండడం లేదు. కానీ విక్టరీ వెంకటేష్ – వరుణ్ తేజ్ లు కలిసి చేస్తోన్న “ఎఫ్ 2” మాత్రం ప్రేక్షకులు ఆశించేటంత ఫన్ ను పంచడానికి సిద్ధంగా ఉందన్న విషయాన్ని ఈ సినిమా పోస్టర్లు చెప్పకనే చెప్తున్నాయి.

దీపావళి సందర్భంగా హీరోలు – హీరోయిన్లతో కూడిన ఫస్ట్ లుక్ పోస్టర్ మెప్పించగా, తాజాగా పండగ రోజున తోడల్లుళ్ళుగా నటిస్తోన్న వెంకీ – వరుణ్ ల పోస్టర్ ను విడుదల చేసి సినీ ప్రేక్షకులు ఆసక్తిని మరింతగా పెంచారు. గళ్ళ లుంగీ… ఎర్ర చొక్కాలతో… మాంచి మాస్ స్టెప్ లు వేస్తోన్న ఈ ఇద్దరూ సంక్రాంతికి మాంచి జోరుగా రాబోతున్నారు.

ఈ పోస్టర్ తో పాటు వరుణ్ తేజ్ హీరోగా రూపొందుతోన్న మరో సినిమా “అంతరిక్షం 9000 కేఏంపీహెచ్” పోస్టర్ ను కూడా రిలీజ్ చేసారు. వరుణ్ – లావణ్యలు కలిసి ఉన్న ఈ పోస్టర్ దీపావళి వెలుగులను ప్రేక్షకులకు పంచింది. క్రిష్ నిర్మాతగా సంకల్ప్ రెడ్డి దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమాను డిసెంబర్ 21వ తేదీన విడుదల చేయనున్నారు.