CBEC Yash Raj Films, CBEC Notice Yash Raj Films, CBEC Yash Raj Films Service Tax Notices, CBEC Yash Raj Films Disclose Payments, CBEC Notices Producers ప్రముఖ బాలీవుడ్ నటులు, ప్రఖ్యాత ప్రొడక్షన్ హౌస్ లకు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఎక్సైజ్ అండ్ కస్టమ్స్ (సీబీఎఫ్సీ) నోటీసులు జారీ చేసింది. అమీర్ ఖాన్, రణ్ వీర్ సింగ్ వంటి టాప్ స్టార్లకు రెమ్యూనరేషన్ ఎంత ఇస్తున్నారు? అంటూ యశ్ రాజ్ ఫిల్మ్స్, సల్మాన్ ఖాన్ ప్రొడక్షన్స్ వంటి నిర్మాణ సంస్థలకు సీబీఎఫ్సీ నోటీసులు జారీ చేసింది. అలాగే ఆయా సంస్థల నుంచి ఎంత రెమ్యూనరేషన్ తీసుకున్నారో వెల్లడించాలని పలువురు నటులకు కూడా సీబీఎఫ్సీ నోటీసులు అందజేసింది.

పేరు ప్రఖ్యాతులున్న సర్వీస్ ట్యాక్స్ ఎగవేతదారులను ఏరివేసేందుకు చేపట్టిన చర్యల్లో భాగంగా ఈ నోటీసులు జారీ చేసినట్టు బాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. ఇందులో భాగంగా యశ్ రాజ్ ఫిల్మ్స్, సల్మాన్ ఖాన్ ప్రొడక్షన్స్, అమీర్ ఖాన్, రణ్ వీర్ సింగ్ తదితరులు ఈ నోటీసులు అందుకున్నారని ఇంటెలిజెన్స్ అధికారులు వెల్లడించారు. బాలీవుడ్ లో పన్ను ఎగవేతదారులను గుర్తించే పనిలో సీబీఎఫ్సీ మునిగిపోయిందని మరో అధికారి తెలిపారు. వారం రోజుల్లో వారి నుంచి సమాచారం కోరే అవకాశం ఉందని తెలుస్తోంది.