Ex--Minister-Pydikondala-Manikyala-Rao-Says-CM-Chandrababu-Given-Promises-Failsతన సొంత నియోజకవర్గం తాడేపల్లిగూడెంకు, పశ్చిమ గోదావరి జిల్లాకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీలను నెరవేర్చలేదని ఆరోపిస్తూ బీజేపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి మాణిక్యాలరావు నిరవధిక దీక్ష ఆరంభించారు. తహసిల్దార్ ఆఫీస్ వద్ద ఆయన దీక్షకు ప్రయత్నించగా, అదికారులు అనుమతి ఇవ్వలేదు.దాంతో ఆయన తన క్యాంప్ కార్యాలయంలోనే దీక్ష కు కూర్చున్నారు. జిల్లాకు ఇచ్చిన 56 హామీలను వెంటనే నెరవేర్చాలని డిమాండ్‌ చేశారు.

ఆయన దీనిపై చంద్రబాబుకు ఒక లేఖ రాసి రాజీనామా పత్రాన్ని కూడా జత చేసి పంపించారు. దానిపై స్పందన లేకపోవడంతో ఆయన దీక్ష చేపట్టారు. ఎన్నికలకు ఏడాది ముందు రాజీనామా చేసినా ఉపఎన్నికలు వచ్చే అవకాశం ఉండదు. కాబట్టి మాణిక్యాల రావు ధైర్యంగా స్పీకర్ కోడెల శివప్రసాద్ రావు కు రాజీనామా లేఖ పంపి ఉండాల్సింది. కాకపోతే ముఖ్యమంత్రికే పంపారు. ముఖ్యమంత్రికి రాజీనామా లేఖ పంపితే ఏం ఉపయోగం? ఎన్నికలు సమీపిస్తున్నాయి కాబట్టి ఇలా ఉత్తుత్తి రాజీనామాలు, దీక్షలు చేసి, వాటిని వంకగా చూపించి ఎన్నికలకు వెళ్ళడమే వ్యూహంగా కనిపిస్తుంది.

నిజానికి మాజీ మంత్రి ఇప్పుడు తన నియోజకవర్గంలో వచ్చే ఎన్నికలలో డిపాజిట్ కూడా తెచ్చుకోలేని పరిస్థితి. టీడీపీతో పొత్తు వల్లే ఆయన 2014 ఎన్నికలలో గెలిచారన్నది నిర్వివాదం. టీడీపీతో అంట కాగినన్ని రోజులు, మంత్రి పదవి అనుభవించినప్పుడు ఆయనకు ఇవేమీ గుర్తు రాలేదు. ఇటువంటి వాటిని ప్రజలు నమ్మే పరిస్థితి ఉంటుందా? అందుకే ఆ పార్టీకి రాష్ట్రంలో భవిష్యత్తు లేదని పార్టీ నేతలు ఒక్కొకరుగా తమ దారి తాము చూసుకుంటున్నారు. ఆర్ఎస్ఎస్ వాది కాబట్టి మాణిక్యలరావు ఏమైనా మిగిలిపోవచ్చు.