Did Election Commission Lie About EVMs Malfunctioning?ఆంధ్రప్రదేశ్ లో పోలింగ్ సందర్భంగా పెద్ద ఎత్తున ఈవీఎంలు మొరాయించిన సంగతి తెలిసిందే. వివిధ కేంద్రాల్లో కనిష్ఠంగా 45 నిమిషాలు నుంచి గరిష్ఠంగా 7 గంటల వరకూ ఈవీఎంలు పనిచేయలేదు. దీనివల్ల చాలా చోట్ల మరునాడు తెల్లవారాక కూడా పోలింగ్ జరపాల్సి వచ్చింది. అయితే ఎన్నికల సంఘం ఈ విషయాన్నీ కప్పిపుచ్చే ప్రయత్నం చేస్తుంది. ఏపీలో 92 వేల ఈవీఎంలను ఎన్నికల్లో వినియోగించగా, 381 ఈవీఎంల్లోనే సమస్యలు వచ్చాయి.

మొత్తం ఈవీఎంల్లో ఇది 0.03 శాతం మాత్రమే అని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి గోపాలకృష్ణ ద్వివేది చెప్పుకొచ్చారు. ఇది ఇలా ఉండగా సీఈసీ సునీల్‌ అరోడా ఆంధ్రప్రదేశ్‌లో కేవలం 45 ఈవీఎంల్లోనే సమస్య వచ్చిందని చెప్పడం విశేషం. చంద్రబాబు ఈ విషయాన్ని దేశవ్యాప్తంగా చర్చ పెట్టడంతో ఎన్నికల సంఘం ఆత్మరక్షణలో పడింది. పరిస్థితి తీవ్రతని తక్కువ చేసి చూపించే ప్రయత్నం చేస్తుంది. క్షేత్రస్థాయిలో పరిశీలించినప్పడు 4,583 చోట్ల ఈవీఎంలు, వీవీప్యాట్లు, కంట్రోల్‌ యూనిట్లు మొరాయించినట్లు తేలింది.

సహజంగా రెండు మూడు వందల ఈవీఎంలు మొరాయించడం మాములే. అదే జరిగి ఉంటే పోలింగ్ మహా అయితే ఆ రోజు రాత్రి 9 గంటలవరకూ జరిగేది. తప్పు ఎక్కడ జరిగింది అని దానిని వదిలేసి అసలు తప్పే జరగలేదు అని బుకాయిస్తుంది ఎన్నికల సంఘం. అసలు ఆంధ్రప్రదేశ్ లోనే ఈ సమస్య ఎందుకు తీవ్రతరంగా జరిగింది అనే దానికి కూడా సమాధానం లేదు. ఇన్ని జరిగినా తప్పు పట్టిన వారి మీద ఎదురు దాడి చేసి కేసులు పెట్టడం మరింత ఆశ్చర్యం కలిగిస్తుంది.