ETV news tops in Coronavirus updatesతెలుగు మీడియాలో ఈనాడుది విశిష్ట పాత్ర. ఈనాడు పత్రిక అయితేనేమీ టీవీ అయితేనేమి సహజంగా మీడియా సంస్థలలో ఉండే సెన్సషలిజం ఉండదు. వార్తలను సూటిగా సుత్తి లేకుండా చెబుతుంది. దీనితో ఈనాడుకి ఉండే విశిష్టత దానికి ఎప్పుడూ ఉంటుంది. కాకపోతే సెన్సషలిజం మీద ఆధారపడే ఛానెల్స్ కే ఎక్కువ రేటింగ్స్ వస్తాయి.

అయితే కరోనా సంక్షోభ సమయంలో ఇది కాస్తా మారిపోయింది. ఈ వారం ఈటీవీ (జనరల్ ఎంటర్టైన్మెంట్ ఛానల్) న్యూస్ టీవీ రేటింగ్స్ లో ఆధిపత్యం చెలాయించింది. టాప్ ఫైవ్ ప్రోగ్రామ్‌లు ఈటీవీ న్యూస్ బులెటిన్‌లు ఉండడం విశేషం. వీటిలో ప్రతి 10 టివిఆర్‌లకు పైగా ఉండడం విశేషం.

సహజంగా ఈటీవీలో ఉదయం 7 గంటలకు, సాయంత్రం 9 గంటలకు వార్తలు వస్తాయి. ఈ సంక్షోభ సమయంలో సాయంత్రం 4 గంటలకు కూడా ఒక వార్తల స్లాట్ ని ప్రవేశపెట్టింది ఛానల్ మేనేజ్మెంట్. అయితే 24 గంటల తెలుగు వార్తా ఛానెల్‌లు ఈ అవకాశాన్ని పెద్దగా ఉపయోగించుకోలేకపోయాయిని చెప్పుకోవచ్చు. వారి మొత్తం రేటింగ్‌లో పెరుగుదల కనిపించలేదు.

ఇది ఇలా ఉండగా… ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసుల సంఖ్య ఈ ఉదయం నాటికి 348కి చేరింది. అలాగే తెలంగాణలో నిన్నటి వరకు 453 కేసులు ఉన్నాయి. అలాగే దేశంలోని మొత్తం కేసులు 6,000 వైపుకు పరిగెడుతున్నాయి. మరోవైపు మూడు వారాల పాటు విధించిన లొక్డౌన్ ఈ నెల 14తో పూర్తి అవుతుంది. దానిని పొడిగించే అవకాశం ఉంది.