Etela Rajender -KCRతెలంగాణ రాజకీయాలు ఉన్నఫళంగా వేడెక్కాయి. సొంత మంత్రి మీద అధికార పార్టీ కి చెందిన మీడియానే అట్టాక్ చేసి… ఆయన నెత్తిన 100 కోట్ల కుంభకోణానని తగిలించారు. ఆ తరువాత ఈటలను అవమానక రీతిలో మంత్రివర్గం నుండి కూడా తొలగించారు. ఈటల మీడియా ముందుకు వచ్చి కేసీఆర్ మీద అనేక ఆరోపణలు చేశారు.

మరోవైపు.. ఈటల ను అరెస్టు చెయ్యడం ఖాయమని వార్తలు వస్తున్నాయి. అయితే ఈటల ఉదంతంపై ఇప్పటివరకూ ప్రతిపక్ష పార్టీలు పెద్దగా స్పందించకపోవడం విశేషం. మరీ ముఖ్యమంగా కేసీఆర్ మీద ఎప్పుడు విమర్శించడానికి అవకాశం దొరుకుంతుందా అంటూ వేచి చూసే రేవంత్ రెడ్డి కూడా ఇప్పటివరకూ స్పందించలేదు.

ఈటల ఉద్యమ సమయం నుండీ తెరాసలో పని చేశారు. రాష్ట్ర సాధన కోసం పనిచేసిన వారిలో ప్రథమ స్థానంలో ఉంటారు. పైగా ప్రజలలో కూడా ఈ వార్త బయటకు వచ్చినప్పటి నుండీ ఈటల మీద సానుభూతే కనిపిస్తుంది. ఈ తరుణంలో ప్రతిపక్ష పార్టీలు వేచి చూసే ధోరణని అవలంభిస్తున్నాయి.

“తెలంగాణ రాజకీయాలలో తెరాసకు ఉద్యమ ఎడ్వాంటేజ్ అనేది చాలా పెద్ద విషయం. ఈటల వంటి వారని ఇబ్బంది పెట్టడం వల్ల కేసీఆర్ ఆ ఎడ్వాంటేజ్ కు దూరం అయ్యే అవకాశం ఉంది. దీనితో అసలు ఈటల నెక్స్ట్ స్టెప్ ఏంటి అనేది చూసి ఆయనను ఏమైనా తమకు అనుకూలంగా మార్చుకుందా అనే ధోరణిలో ఉన్నారు,” అంటూ విశ్లేషకులు దీనిని చూస్తున్నారు.