Etela Rajender comments abouts Kcrతెలంగాణాలో నానాటికి బీజేపీ ప్రభావం పెరుగుతూ పోతుంది. ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న కాంగ్రెస్ అంతర్గత విభేదాలతో తన స్థానాన్ని దిగజార్చుకుంటుండగా, ఈటెల విజయంతో ఊపు మీదున్న బీజేపీని అసెంబ్లీ సాక్షిగా కట్టడి చేసే ప్రయత్నం చేస్తున్నారు సీఎం కేసీఆర్.

అసెంబ్లీ లో బీజేపీ తీరును తప్పుపట్టిన స్పీకర్ బీజేపీ నేతలను అసెంబ్లీ నుండి సస్పెండ్ చేసిన విషయం అందరికి విదితమే. ఈ సందర్భంగా ఈటెల మాట్లాడుతూ కేసీఆర్ తమను చూసి భయపడుతున్నారని., నన్ను అసెంబ్లీకి రాకుండా చేయడానికే కేసీఆర్ ఈ వ్యూహాన్ని పన్నారని ఆరోపించారు.

కేసీఆర్ కు నైతికతే లేదని., తమ ప్రతాపాన్ని ప్రతిపక్ష పార్టీల నిర్మూలనకు వినియోగిస్తారని, అందులో భాగంగానే 2014 ఎన్నికల ఫలితాల తర్వాత టీడీపీ పార్టీని., 2018 ఎన్నికల తర్వాత కాంగ్రెస్ పార్టీని కనుమరుగుచేశారని విమర్శలు గుప్పించారు ఈటెల.

టీడీపీ పార్టీతో రాజకీయ అరంగేట్రం చేసి తెలుగుదేశం పార్టీనే మింగేశారని., తెలంగాణ ఇస్తే తెరాస పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేస్తానని సోనియా గాంధీ కాళ్ళకు మోకరిల్లి తీరా తెలంగాణ రాష్ట్రం వచ్చినాక కాంగ్రెస్ పార్టీని మింగేసిన చరిత్ర ఈ కేసీఆర్ ది అంటూ తెలంగాణ ముఖ్యమంత్రిపై ఒక రేంజ్ లో ఫైరయ్యారు ఈటెల.

ఇప్పుడు ఇదే సిద్ధాంతాన్ని బీజేపీపై ప్రయోగిస్తున్నారని కానీ ఇక్కడ కేసీఆర్ పప్పులుడకవని ప్రభుత్వానికి గట్టి హెచ్చరికలు చేశారు బీజేపీ నేతలు. కేసీఆర్ ను తెలంగాణ ప్రజలు బండకేసి బాదే రోజులు త్వరలోనే వస్తాయని., కార్మిక సంఘాలను రద్దు చేసిన ఘనత కేసీఆర్ దే అంటూ ముఖ్యమంత్రిపై తన ఆక్రోశాన్ని వెలిబుచ్చారు ఈటెల.

తెలంగాణ ఉద్యమకారుడిగా తన చరిత్ర తెలంగాణ ప్రజల గుండెల్లో ఎప్పుడు నిలిచే ఉంటుందని., హుజురాబాద్ లో కేసీఆర్ – ఈటెల మధ్య జరిగిన పోటీ తెరాస – బీజేపీ మధ్య జరిగిన పోటీ కాదని., అది “కేసీఆర్ అహంకారానికి – తెలంగాణ ఆత్మ గౌరవానికి”మధ్య జరిగిన పోటీగా తాను భావిస్తున్నట్లుగా చెప్పారు.