ELKDTAL-Sonam-Kapoor-AnilKapoorత‌న తండ్రి అనిల్ క‌పూర్‌తో కలిసి వెండితెర మీద క‌నిపించ‌నుండ‌టం చాలా ఆనందంగా ఉందని బాలీవుడ్ ఫాషన్ ఐకాన్ సోన‌మ్ క‌పూర్ చెబుతోంది. వాళ్లిద్ద‌రూ తండ్రీ కూతుళ్లుగా నటిస్తున్న సినిమా పేరు ‘ఏక్ ల‌డ్కీ కో దేఖా తో ఐసా ల‌గా’. ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ పంజాబ్‌లో జ‌రుగుతోంది. తండ్రి అనిల్ క‌పూర్‌ తో మొద‌టి షాట్ వివ‌రాల‌ను సోన‌మ్ త‌న ఇన్‌స్టాగ్రాంలో షేర్ చేసింది.

‘ఇండ‌స్ట్రీకి వ‌చ్చిన ప‌దేళ్ల త‌ర్వాత నా తండ్రితో క‌లిసి న‌టించే అవ‌కాశం వ‌చ్చింది. థ్యాంక్యూ షెల్లీ చోప్రా’ అని ఆమె పోస్ట్ చేసింది. షెల్లీ చోప్రా ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ సినిమాకు అనిల్ క‌పూర్ చిత్రం ‘1942 ఎ ల‌వ్ స్టోరీ’లోని ఓ పాట‌లోని మొదటి పదాలను పేరుగా పెట్టారు. ఇందులో అనిల్‌ కి జంట‌గా జూహీ చావ్లా న‌టిస్తుండ‌గా, సోన‌మ్‌కి జంట‌కి రాజ్‌కుమార్ రావ్ న‌టిస్తున్నారు.

దాదాపు 11 ఏళ్ల త‌ర్వాత అనిల్‌, జూహీలు తెర మీద జంట‌గా క‌నిపించ‌బోతున్నారు. అక్టోబ‌ర్ 12న ఈ చిత్రాన్ని విడుద‌ల చేసేందుకు నిర్మాత విధు వినోద్ చోప్రా స‌న్నాహాలు చేస్తున్నారు. అలాగే ఈ ఏడాది త‌న కుమారుడు హ‌ర్ష‌వ‌ర్థ‌న్ క‌పూర్‌తో క‌లిసి కూడా అనిల్ క‌పూర్ న‌టించ‌నున్నారు. ఒలింపిక్ ప‌త‌కం గెల్చుకున్న అభిన‌వ్ బింద్రా బ‌యోపిక్‌లో వారిద్ద‌రూ క‌లిసి న‌టించ‌బోతున్నారు.