electronic manufacturing cluster in andhra pradeshఆంధ్రప్రదేశ్‌ లో స్థాపించనున్న ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్‌కు కేంద్రం ఆమోదం తెలిపింది. రేణిగుంటలో శ్రీ వెంకటేశ్వర మొబైల్ అండ్ ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ ప్రైవేట్ లిమిటెడ్‌కు కేంద్ర ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖ ఆమోద ముద్ర వేసింది. దీనికి సంబందించిన ఉత్తర్వులు ఈరోజు జారీ అయ్యాయి.

గ్రీన్ ఫీల్డ్ ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్‌గా గుర్తిస్తూ కేంద్రం ఆమోదించింది. మొత్తం 113.27 ఎకరాల్లో మౌలిక వసతులతో రేణిగుంట ఈఎంసీని ఏర్పాటు చేయనున్నారు. సెల్‌కాన్, కార్బన్, లావా మొబైల్ కంపెనీలు భాగస్వాములుగా క్లస్టర్ ఏర్పాటు చేయనున్నారు. సెల్‌కాన్, డిక్సన్ కంపెనీలు ఇప్పటికే కార్యకలాపాలు ప్రారంభించగా, త్వరలోనే కార్బన్ కంపెనీ కార్యకలాపాలు ప్రారంభించనుంది.

ఈ ప్రాజెక్ట్ వల్ల రాష్ట్రానికి ఎన్నో పెట్టుబడులు, ఉద్యోగాలు రాబోతున్నాయి. చుట్టుపక్కల ఉన్న ప్రజలకి శిక్షణ ఇచ్చి ఉద్యోగాలు ఇవ్వనున్నారు. కరువుకు, వలసలకు పేరుగాంచిన రాయలసీమకు వరప్రదాయినిగా పరిణమించనుంది.