which-is-the-winning-horse-tdp-chandrababu-naidu-vs-ysr-congress-ys-jagan-vs-janasena-pawan-kalyanదేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికల నగారా మోగింది. కాసేపటి క్రితం ఢిల్లీలో నాలుగు రాష్ట్రాల అసెంబ్లీలతో పాటు లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్‌ను కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. ఆంధ్రప్రదేశ్‌, ఒడిశా, సిక్కిం, అరుణాచల్‌ ప్రదేశ్‌ రాష్ట్రాల అసెంబ్లీలతో పాటు లోక్‌సభ స్థానాల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో 175, ఒడిశాలో 147, అరుణాచల్‌ ప్రదేశ్‌లో 60, సిక్కింలో 32 శాసనసభ స్థానాలకు ఎన్నికలు నిర్వహించనున్నారు. మొత్తం ఏడు దశల్లో ఈ ఎన్నికలు జరగనున్నాయి.

ఏప్రిల్‌ 11న తొలి దశ ఎన్నికలు నిర్వహించనున్నారు. మొదటి దశలోనే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలో పార్లమెంట్ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. అదే రోజున ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలు కూడా జరుగుతాయి. మే 23న దేశవ్యాప్తంగా ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. అదే రోజు ఫలితాలు కూడా వెల్లడి అవుతాయి. షెడ్యూల్‌ ప్రకటనతో తక్షణమే దేశవ్యాప్తంగా ఎన్నికల కోడ్‌ అమల్లోకి వచ్చింది. దేశవ్యాప్తంగా 10 లక్షల పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నారు.

గత ఎన్నికలతో పోలిస్తే ఈసారి అదనంగా లక్ష పోలింగ్‌ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నారు. ఈసారి మొత్తం అర్హులైన ఓటర్లు 90 కోట్లు. కేంద్రంలో నరేంద్ర మోడీ, ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబు నాయుడు తిరిగి అధికారంలోకి రావడానికి తమ సర్వశక్తులు ఒడ్డుతున్నారు. ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు అన్నట్టు జగన్ ఉన్నారు. తెలంగాణాలో ఉన్న 17కు 17 స్థానాలు గెలిచే ఈ సారి కేంద్రంలో వచ్చే ప్రభుత్వంలో చక్రం తిప్పాలని అటు కేసీఆర్ ఆరాటపడుతున్నారు. మొదటి సారి పోటీ చేస్తున్న పవన్ కళ్యాణ్ కూడా తన ప్రభావం చూపించాలని అనుకుంటున్నారు.