election-commissioner of andhra pradesh ramesh kumarఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికలు వాయిదా వేస్తున్నట్లు ఏపీ ఎస్ఈసీ రమేష్ కుమార్ ప్రకటించగానే ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆయన పై విరుచుకుపడ్డారు. కమ్మ కులానికి చెందిన వాడు కావడం, చంద్రబాబుకు తొత్తుగా పని చెయ్యడంతోనే ఈ చర్యకు పాల్పడ్డారని ఆక్షేపించారు. ఆ తరువాత ఎన్నికలు యథావిధిగా జరపాలని.. రాష్ట్రంపై కరోనా ప్రభావం లేదని ఈ మేరకు రమేష్ కుమార్‌కు సీఎస్ నీలం సాహ్ని లేఖ రాశారు.

దీనికి ఎస్ఈసీ రమేష్ కుమార్ వివరణ ఇస్తూ ఒక లేఖ విడుదల చేశారు. రాష్ట్ర ఎన్నికల కమీషన్ ఈ నిర్ణయం తీసుకునే ముందు ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరికలను, ఆరోగ్య- కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖతో మార్గదర్శకాలను పరిగణలోకి తీసుకుంది అని చెప్పుకొచ్చారు. అలాగే ఇదే విషయంగా 14వ తేదీన ఈ విషయంగా ఆరోగ్య, కుటుంబ సంక్షేమ ప్రధాన కార్యదర్శిని సంప్రదించామని చెప్పుకొచ్చారు.

అయితే ఆయన కమిషన్ అడిగిన సమాచారం ఇవ్వలేదని రమేష్ చెప్పుకొచ్చారు. దానితో తాము కేంద్ర ఆరోగ్య- కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖతో మార్గదర్శకాలను పరిగణలోకి తీసుకుని ఈ నిర్ణయానికి వచ్చాం అన్నారు. బహుశా మీ ఆరోగ్య, కుటుంబ సంక్షేమ ప్రధాన కార్యదర్శి కరోనా సందర్భంగా బిజీగా ఉండి ఉండవచ్చు అని రమేష్ చెప్పుకొచ్చారు.

అయితే ఉద్దేశపూర్వకంగానే ప్రభుత్వం ఆ సమాచారం ఎన్నికల కమిషన్ కు పంపి ఉండదని పలువురు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. “తమని సంప్రదించకుండా ఎన్నికలు వాయిదా వెయ్యరని, సమాచారం ఇవ్వకపోతే వాయిదా ప్రక్రియ ముందుకు సాగదని ప్రభుత్వ పెద్దలు అనుకుని ఉంటారు. అయితే ప్రధాన ఎన్నికల అధికారి కేంద్ర మార్గదర్శకాలను పరిగణలోకి తీసుకుని ఎన్నికలు వాయిదా వేశారు. దీనితో కోపంతో రగిలిపోయిన జగన్ ఆయనను దూషిస్తూ ప్రెస్ మీట్ పెట్టారు. అసలు తమను సంప్రదించలేదని అబద్దాలు చెప్పి ఉంటారు,” అని పలువురు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.