election-commission-of-india-election-commission-to-announce-lok-sabha-poll-schedule-today-at-5-pmఈరోజు సాయంత్రం ఎన్నికల నగారా మోగబోతుంది. 17వ లోక్ సభ ఎన్నికల షెడ్యూల్ ఈ రోజు సాయంత్రం ఐదు గంటలకు కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించబోతుంది. లోక్ సభ ఎన్నికలతో పాటు నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ కూడా విడుదల కాబోతుంది. సాయంత్రం 5 గంటలకు ఒక ప్రెస్ మీట్ లో కేంద్ర ఎన్నికల సంఘం ఈ వివరాలను వెల్లడించనున్నారు. పోలింగ్‌ తేదీలు, ఎన్ని దశల్లో ఎన్నికల నిర్వహణ వివరాలను సీఈసీ సునీల్‌ అరోడా ప్రకటించనున్నారు.

షెడ్యూల్‌ ప్రకటనతో దేశవ్యాప్తంగా ఎన్నికల నియమావళి అమల్లోకి రానుంది. లోక్‌సభ ఎన్నికలతోపాటే ఆంధ్రప్రదేశ్‌, ఒడిశా, సిక్కిం, అరుణాచల్‌ప్రదేశ్‌ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఏప్రిల్‌, మే నేలల్లో 7 లేదా 8 విడతల్లో పోలింగ్‌ జరిగే అవకాశం ఉంది. మొదటి విడతలోనే రెండు తెలుగు రాష్ట్రాలకు ఎన్నికలు జరగబోతున్నట్టు కొంత కాలంగా వదంతులు వినిపిస్తున్నాయి. ఏప్రిల్‌ మొదటి వారంలో తొలి విడత పోలింగ్‌ ఉండనున్నట్లు సమాచారం.

తొలి విడత పోలింగ్‌కు ఈ నెలాఖరున నోటిఫికేషన్‌ విడుదలయ్యే అవకాశం ఉంది. జూన్‌ 3వ తారీఖుతో ప్రస్తుత లోక్‌సభ కాలపరిమితి ముగియనుంది. కేంద్రంలో నరేంద్ర మోడీ, ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబు నాయుడు తిరిగి అధికారంలోకి రావడానికి తమ సర్వశక్తులు ఒడ్డుతున్నారు. ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు అన్నట్టు జగన్ ఉన్నారు. తెలంగాణాలో ఉన్న 17కు 17 స్థానాలు గెలిచే ఈ సారి కేంద్రంలో వచ్చే ప్రభుత్వంలో చక్రం తిప్పాలని అటు కేసీఆర్ ఆరాటపడుతున్నారు.