TRS -KCRతెలంగాణాలో ముందస్తు ఎన్నికల నిర్వహణకు సన్నద్ధతపై సమీక్షించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం బృందం ఒకటి ఈ నెల 10న హైదరాబాద్‌ రానున్నట్లు, రెండు రోజులపాటు సమీక్షలు నిర్వహించనున్నట్లు తెలిసింది. ఆ తర్వాతే ఎన్నికల నిర్వహణ తేదీలపై తుది నిర్ణయాన్ని వెలువరించే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.

ఓటర్ల నమోదు, మార్పుచేర్పులకోసం 32.9 లక్షల దరఖాస్తులు అందాయి. వాటిలో నిన్న ఉదయం వరకు 1.76 లక్షల దరఖాస్తులను అధికారులు తిరస్కరించారు. మరో మూడున్నర లక్షల దరఖాస్తులు పెండింగులో ఉన్నాయి. ఈరోజు చివరికి ఈ ప్రక్రియ పూర్తి చెయ్యాలని టార్గెట్ పెట్టుకున్నట్టు సమాచారం.

తుది ఓటర్ల జాబితాను ఈ నెల 8న వెలువరించి ఆ అంకాన్ని పూర్తి చెయ్యబోతున్నారు. కోర్టులో ఉన్న పెండింగ్ కేసుల వల్ల ఇబ్బంది కలిగితే తప్ప నవంబర్ లో ఎన్నికలు జరగడం ఖాయమని రాష్ట్ర ఎన్నికల సంఘంలోని కొందరు అంటున్నారు. ఎన్నికల షెడ్యూల్ కోసం అధికార పార్టీ నేతలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.