Ekta Kapoor Kamasutra in Webseriesబాలీవుడ్ నాట బోల్డ్ కంటెంట్ కు కేరాఫ్ అడ్రస్ ఏక్తా కపూర్. ఇప్పటికే పలు హాట్ హాట్ వెబ్ సిరీస్ లను నిర్మిస్తోన్న ఏక్తా కపూర్, త్వరలో ‘కామసూత్ర’ను రూపొందించే ప్లానింగ్ లో ఉన్నట్లుగా తెలుస్తోంది. హిందూ సంప్రదాయమైన కామసూత్ర ఫార్ములాతో రాజస్తాన్ లోని గోలి కులస్తుల చరిత్రను ఆధారంగా దీనిని నిర్మించే ప్లానింగ్ జరుగుతోంది.

ప్రస్తుతం స్క్రిప్ట్ దశలో ఉన్న ఈ కామసూత్రకు దర్శకత్వం వహించడానికి మంచి దర్శకుడు కోసం అన్వేషణ చేస్తున్నారు. హిందూ సంప్రదాయాలను, కామసూత్ర ఫ్లేవర్ ను మిస్ చేయకుండా ఉండే విధంగా పరిజ్ఞానం కలిగిన డైరెక్టర్ కోసం ఏక్తా ఎదురుచూస్తున్నారట. ‘కామసూత్ర’ అంటే సెన్సార్ నిబంధనలు ఎక్కువ ఉండడం సహజమే. అందుకే వెబ్ సిరీస్ ను ఎంపిక చేసుకున్నట్లుగా సమాచారం.