ekkadiki-pothavu-chinnavada-punches-on-modi-notes-ban‘మినిమమ్ గ్యారెంటీ’ హీరో నుండి ‘గ్యారెంటీగా నమ్మొచ్చు’ అనే హీరో స్థాయి వరకు ఎదిగిన నిఖిల్ నటించిన తాజా చిత్రం “ఎక్కడికి పోతావు చిన్నవాడా” సినిమా ప్రస్తుతం ధియేటర్లో సందడి చేస్తోంది. మోడీ తీసుకున్న పెద్ద నోట్ల రద్దు నిర్ణయంతో… పలు సినిమాలు వెనక్కి తగ్గిన నేపధ్యంలో… ధైర్యంగా ముందడుగు వేసిన నిఖిల్ నిర్ణయానికి ప్రేక్షకులు బ్రహ్మరధం పట్టారు. ఎంటర్టైనింగ్ గా సాగిన ఈ సినిమాలో మోడీ తీసుకున్న నోట్ల రద్దుపై కూడా పలు పంచ్ లు వేయడం విశేషం.

కమెడియన్ ‘వెన్నెల’ కిషోర్ ను హీరో నిఖిల్, మరో కమెడియన్ సత్య మెంటల్ హాస్పిటల్ కు తీసుకువెళ్ళిన సందర్భంలో… డాక్టర్ గా నటించిన బత్తాయి బాబ్జీ ‘30 ఇయర్స్ ఇండస్ట్రీ’ పృధ్వీ ఫీజు అడగగా, వీడికి ఆ పాత 1000 నోట్ల కాగితాలు అంటకడదాం అంటూ మరో కమెడియన్ సత్య చెప్పిన డైలాగ్ ధియేటర్లో బాగా పేలింది. ఇది ఫస్టాఫ్ లో సన్నివేశం కాగా, సెకండాఫ్ లో సత్య చేతే మరో పంచ్ పేల్చాడు దర్శకుడు ఆనంద్. హీరోయిన్ దెయ్యంగా మారిన సందర్భంలో… ఎందుకు అక్కా… ఏమైనా ప్లాన్ చేసావా ముందే చెప్పు… అసలే బ్యాంకుకు వెళ్లి 500 రూపాయలు నోట్లు మార్చుకోవాలి అని సత్య చెప్పిన డైలాగ్ కూడా నవ్వులు పూయించాయి.

మోడీ రద్దు నిర్ణయం కేవలం 10 రోజుల ముందే బయటకు వెల్లడి కాగా, దానిని కూడా సినిమాలో చేర్చడంతో ప్రేక్షకులు అవాక్కయ్యారు. డబ్బింగ్ లో మేనేజ్ చేసినా గానీ, ప్రేక్షకులను మాత్రం బాగా గిలిగింతలు పెట్టాయి. ఈ పంచ్ లతో పాటు నిఖిల్ నటించిన ‘శంకరాభరణం’ పైన కూడా మరో పంచ్ పేల్చాడు. భామ్మగా నటించిన అన్నపూర్ణ ‘శంకరాభరణం’ సినిమాలో పాట పాడుతున్నపుడు, అది సరిగా వర్కౌట్ కాలేదు గానీ, మరో సినిమాలో పాట పాడమని కోరగా, ‘స్వామిరారా’ అంటూ అన్నపూర్ణ ఆలపించిన వైనం కూడా వినోదాన్ని పంచింది. మొత్తమ్మీద ప్రేక్షకుల నుండి పాజిటివ్ టాక్ ను రాబట్టడంలో “ఎక్కడికి పోతావు చిన్నవాడా” సక్సెస్ సాధించింది.