The Dove-Eyed Girl Eesha Rebba Heaping Praises on Jr NTRచేసినవన్నీ చిన్న సినిమాలే అయినా… సరైన గుర్తింపు తగ్గ పాత్రలను ఎంపిక చేసుకోవడంలో ఈషా రబ్బా సక్సెస్ సాధించింది. ముఖ్యంగా ఇటీవల విడుదలైన “అ!” సినిమాలో లెస్బియన్ గా పోషించిన పాత్ర ప్రత్యేకమైన గుర్తింపు లభించడంతో పాటు మరిన్ని అవకాశాలను తెచ్చిపెట్టింది. ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ తో “అరవింద సమేత” సినిమాలో కీలక పాత్ర పోషిస్తోన్న ఈ బ్యూటీ, “బ్రాండ్ బాబు” సినిమా ప్రమోషన్స్ లో పాల్గొంటోంది.

అందులో భాగంగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో… ఈ సినిమా పనిమనిషి పాత్ర కోసం మా ఇంట్లో ఉన్న సర్వెంట్ ను అనుకరిస్తూ కొన్ని మేనరిజమ్స్ ను కాపీ కొట్టానని చెప్పిన ఈషా, ఈ ‘బ్రాండ్ బాబు’ ఫుల్ లెంగ్త్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ అని చెప్పుకొచ్చింది. మారుతీ స్టైల్ సినిమా మాదిరే ఫుల్ కామెడీతో పాటు సెంటిమెంట్, రోమాన్స్ తో కూడి కుటుంబంతా చూడదగ్గ సినిమాగా నిలుస్తుందని, ఇందులో నా రోల్ చాలా కీలకమని తెలిపింది.

ఇక ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ తో ‘అరవింద సమేత’ మరియు సుమంత్ తో మరో సినిమాలో నటిస్తున్నానని, ‘అరవింద సమేత’ సినిమాలో రోల్ గురించి ఇప్పుడేం చెప్పలేనని, కానీ ఈ సినిమాలో నా పాత్రకు తగిన గుర్తింపు ఉందని స్పష్టం చేసింది. తన సినిమాలకు తానే డబ్బింగ్ చెప్పుకుంటానని, ఆగష్టు మొదటి వారంలో విడుదల కానున్న “బ్రాండ్ బాబు”ని చూసి ప్రేక్షకులు ఎంజాయ్ చేయాలని, మాకు సక్సెస్ ఇవ్వాలని కోరింది ఈ తెలుగు పిల్ల.