Eenadu-Ramoji-Raoదాదాపూ ఇరవై యేళ్ళ క్రితం ఇంటెర్నెట్ గ్రూప్స్లో ఒక ఈ మైల్ వి.హెచ్.పి, బి.జె.పి సానుభూతిపరులు , తటస్థులు నుండి విపరీతంగా చలామణిలో ఉండేది. ఆ ఈమైల్ ఇండియాలో మీడియా యాజమాన్యం గురించి, దాదాపు అన్ని ప్రఖ్యాత మీడియా గ్రూప్లు ఎలా ఫారిన్ క్రిస్టియన్ సంస్థలు లేక కమ్యూనిస్ట్ సంస్థల పెట్టుబడులు భాగస్వామ్యంతో నడుస్తున్నాయో, అవి భారతీయులని ఎలా ప్రభావితం చేస్తున్నాయో, భారతీయ సంస్కృతి సాంప్రదాయల మీద ఎలా దాడి చేస్తున్నారో వివరిస్తూ హిందువులు మేల్కోవాలని సందేశం ఇచ్చేది. అయితే అదే ఈమైల్, పాన్ ఇండియా స్థాయిలో పూర్తిగా హిందు కుటుంబం చేత నడపబడుతున్న ఏకైక మీడియా సంస్థ ఈనాడు గ్రూప్ అని కూడా చెప్తుంది.

ఈనాడు అధినేత చెరుకూరి రామోజీ రావు కూడా మీడియా రంగంలో విదేశీ పెట్టుబడులకి వ్యతిరేకంగా పోరాడాడు. నేషనల్ మీడియాలా ప్రభావితం చూపే మీడియా సంస్థలు ఢిల్లీలో ఉండేవి కానీ, వాటికి దేశవ్యాప్తంగా నెట్వర్క్ ఈటీవీ కి ఉన్నంత ఉండేది కాదు. అప్పటి బీజేపీ అగ్ర నేతలు రామోజీ రావుని గౌరవించడం అతని కాంగ్రెస్ వ్యతిరేకత వల్ల మాత్రమే కాక, అతను ఒక అత్యంత ప్రభావశిలమైన హిందూ ప్రముఖుడు అవ్వడం. అలాగే మోడీ మొదటిసారి ప్రమాణ స్వీకారం చేసినప్పుడు రామోజీ రావుని దేశాధినేతలతో పాటూ మొదటి వరసలో కూర్చోపెట్టడం జరిగింది. రిలయన్స్ మీడియా రంగంలోకి వచ్చే వరకూ ఈనాడు గ్రూప్ మాత్రమే పూర్తిగా హిందు, స్వదేశీ పెట్టుబడులతో నడపబడుతున్న అతి పెద్ద మీడియా సంస్థ.ఇప్పటికీ ఈనాడు గ్రూప్ హిందువు చేత నడపబడుతున్న పెద్ద సంస్థ అయినా, దాని స్థాయి పదిహేనేళ్ళ క్రితంతో పోల్చుకునేటంతటిది కాదు.

దేశ వ్యాప్తంగా ప్రభావితం చేయగలిగే నెట్వర్క్ కలిగి హిందూ కుటుంబం ఆధ్వర్యంలో నడపబడుతున్న అలాంటి అతి పెద్ద మీడియా సంస్థ, తన వాటాని అమ్ముకుని తెలుగు ప్రాంతానికే పరిమితమవడం వెనక ఆంధ్ర ప్రదేష్ క్రైస్తవ రాజకీయ నాయకుల యొక్క రాజకీయ, రాజకీయేతర లక్ష్యాలు ప్రయోజనాలు ఉన్నాయనడంలో సందేహం లేదు. సమకాలీన ఆంధ్ర ప్రదేశ రాజకీయ, సామాజిక ముఖ చిత్రాన్ని గమనిస్తే క్రైస్తవ రాజకీయ నాయకులు ఈనాడుని కట్టడి చేయడం ద్వారా తమ స్వార్ధ ప్రయోజనాలని ఎలా నెరవేర్చుకున్నారో రూఢిగా తెలుస్తుంది. దురదృష్టవశాత్తూ తెలుగు హిందువులూ అనాలోచితంగా ఇందులో భాగం అయ్యారు.

తను అధికారంలోకి వచ్చే వరకూ తన రాజకీయ అవసరాలకు, తన వాణి రాష్ట్రం నలుమూలలా చేరడానికి ముఖ్యంగా ఈనాడు మరియూ ఇతర పత్రికల మీద ఆధారపడినా, అధికారం చేపట్టాక వై.ఎస్ రాజశేఖర రెడ్డి ఈనాడు యాజమాన్యాన్ని వేధించడం మొదలుపెట్టాడు. ఇది కేవలం ఈనాడు చూపించిన కాంగ్రెస్ వ్యతిరేకత వల్లనే అని పైకి అనిపించవచ్చు. కానీ తరవాత కాలంలో జరిగిన సంఘటనలు గమనిస్తే ఇది ఒక వ్యూహం ప్రకారం, తమ మీడియా సంస్థలని స్థాపించి తమ లక్ష్యాలు సాధించుకోవడంలో భాగంగానే జరిగింది అని తెలుస్తుంది. పైగా, చాలా కాలంగా కాంగ్రెస్ పక్షం వహించిన వార్తా, ఆంధ్ర భూమి, దక్కన్ క్రానికల్ తదితర హిందువుల ఆధ్వర్యంలో నడిచే సంస్థలు రాజశేఖర రెడ్డి అధికారంలోకి వచ్చాక, ఆ తరవాత ఉన్నతిని పొందకపోగా క్షీణించిపోయాయి.

ఒకవైపు ఈనాడు ఆర్ధిక మూలాల మీద దాడి చేస్తూ, అవినీతి క్విడ్ప్రోకో ఆధారంగా ప్రజల సొత్తుని పణంగా పెట్టి సొంత మీడియా సంస్థని ఏర్పాటు చేసుకుని స్థాపించిన రోజునుండే ప్రభుత్వ ప్రకటనలు ఇబ్బడిముబ్బడిగా ఇచ్చి ప్రజా ధనాన్ని మళ్ళించి ఆర్ధికంగా పరిపుష్టం చేసుకున్నారు. ఈనాడు ఆర్ధిక మూలాల మీద జరిగిన దాడి, మార్గదర్శి మదుపుదారుల విశ్వసనీయతని కదిలించలేకపోయింది. రాష్ట్ర ప్రభుత్వం నుండి కేంద్ర ప్రభుత్వం వరకూ తమ సంస్థలో వాటాని అమ్ముకోవడానికి ప్రతికూల పరిస్థితులు కల్పించినా, రామోజీ తమ సంస్థలోని వాటాని అమ్ముకోవడంలో సఫలీకృతుడై మదుపుదారులకి చెల్లింపులు చేసాడు. అయితే, చాప కింద నీరులా జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ఆ తరవాత జరిగిన పరిణామాల వల్ల ఈనాడు గ్రూప్ మరింతగా వాటా అమ్ముకోవలసి వచ్చింది. ఇంకో వైపు వై.ఎస్.ఆర్ కుటుంబం తమ మీడియా సంస్థని ఆర్ధికంగా బలమైన మీడియాగా నిలుపుకుంది.

వై.ఎస్.ఆర్ మొదలుపెట్టిన పని అతని కొడుకు జగన్మోహన్ రెడ్డి కొనసాగిస్తూనే ఉన్నాడు. రాజకీయాల్లో, మీడియాలో విభజించు పాలించు కుట్ర సిద్ధాంతాన్ని అమలు చేసినట్టే, హిందూ సమాజాన్ని, కులాల వారీగా ప్రాంతాల వారీగా రెచ్చగొట్టి తమ భవిష్యత్తుని భద్రపరుచుకునే ప్రయత్నం ఏటు వంటి వెరుపు లేకుండా కనపడెట్టే బహిరంగం గా కొందరు పని గట్టుకొని చెయ్యడం తెలుస్తున్నా కొందరు హిందూ వాదులు కూడా వారికి వంత పాడెట్టు గా బ్రెయిన్ కండిషన్ చెయ్యబడటం ఆందోళన కలిగించే విషయం . వారి వ్యూహాలని అమలుచేయడానికి వారి వారి మీడియా సంస్థలు, మిషనరీ సంస్థలు ఎలా దోహదం చేస్తున్నాయో అందరికీ తెలిసినదే. ఒక ప్రధాన పత్రిక అండగా అనేక వెబ్ మీడియా చానళ్ళు విచ్చలవిడిగా బలమైన హిందూ వర్గాలని విభజించి బలహీనపరిచే క్రతువుని నిరంతరంగా చేస్తున్నాయి. తమ బినామీల ద్వారా ఇతర మీడియా సంస్థల్లో కూడా పెట్టుబడులు పెట్టి వాటినీ ప్రభావితం చేస్తున్నారు.

కేవలం పదిహేనేళ్ళల్లో హిందూ వ్యతిరేక శక్తుల యాజమాన్యంలో నడిచే మీడియ ఇంతలా ఎదగడానికి దోహదం చేసిన తెలుగు హిందువులని ఏమనాలో తెలియని అయోమయ పరిస్థితి వుంది తెలుగు రాష్ట్రాల్లో

– దిలీప్ .ఎం