Ee Nagaraniki Emaindi - movie Trailer‘పెళ్లిచూపులు’ సినిమాతో టాలీవుడ్ లో ఓ ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకున్న దర్శకుడు తరుణ్ భాస్కర్ నుండి రెండవ సినిమాగా రాబోతున్న “ఈ నగరానికి ఏమైంది?” సినిమా ట్రైలర్ రిలీజ్ అయ్యింది. మొదటి సినిమాతో బంపర్ హిట్ కొట్టిన దర్శకులలో ఎక్కువ శాతం మందికి ద్వితీయ విఘ్నం టాలీవుడ్ లో ఉన్న ఓ సెంటిమెంట్. మరి దానిని అధిగమించే విధంగా ఈ ట్రైలర్ ఉందా? అంటే…

నలుగురు స్నేహితుల కధను “ఈ నగరానికి ఏమైంది?” పేరుతో తెరమీదకు తీసుకువచ్చే ప్రయత్నంగా కనపడుతోంది. అయితే ‘పెళ్లిచూపులు’ సినిమాలో జనరేట్ అయిన ‘హ్యుమర్’ ఎలిమెంట్ మిస్ అయినట్లుగా కనపడుతోంది. బహుశా సినిమాలో ఆ ఫన్ ఉంటుందేమో గానీ, ఈ ట్రైలర్ కటింగ్ మాత్రం ఆశించిన స్థాయిలో లేదని చెప్పవచ్చు. ముఖ్యంగా ఇండస్ట్రీలో ఈ సినిమాపై పాజిటివ్ బజ్ ఉన్న రీత్యా, అంత పాజిటివ్ వైబ్ ను ఈ ట్రైలర్ కలిగించలేదు.

ప్రముఖ సురేష్ ప్రొడక్షన్స్ సంస్థ ఈ సినిమాను నిర్మించగా, అనీషా అంబ్రోస్ ఆ నలుగురు యువకులతో పాటు మరో కీలక పాత్రలో నటిస్తోంది. నెక్స్ట్ జనరేషన్ మూవీగా కనపడుతోన్న ఈ సినిమాను ప్రేక్షకులు ఎలా రిసీవ్ చేసుకుంటారో గానీ, ఈ సినిమా ఇంటర్వెల్ బ్లాక్ అదిరిపోతుందన్న ప్రచారం గత కొంతకాలంగా సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ఏది ఎలా ఉన్నా…. ‘ద్వితీయ విఘ్నం’ సెంటిమెంట్ ను తరుణ్ భాస్కర్ దాటుతారో లేదో చూడాలి.