ysr congress EC Nimmagadda Rameshఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికలు వాయిదా మొదలుకుని.. కేంద్రానికి ఎస్ఈసీ రమేష్ కుమార్ లేఖ రాసిన వ్యవహారంపై పెద్ద రగడే జరుగుతోంది. అయితే.. ఈ విషయంలో అధికార పార్టీ.. ప్రతిపక్షాలపై విమర్శలు గుప్పిస్తుండగా.. వైసీపీ మాత్రం ప్రతిపక్షాలపై దుమ్మెత్తిపోస్తోంది. లేఖ సంగతి మీడియాలో రాగానే వైఎస్సార్ కాంగ్రెస్ నాయకులు పెద్ద ఎత్తున ఎదురుదాడికి దిగారు.

అది ఒక ఫేక్ వార్త అని చెప్పే ప్రయత్నం చేశారు. ఎన్నికల సంఘంలోని ఒక అధికారి తో అసలు మా సార్ అటువంటి లేఖ రాయలేదని చెప్పించారు. కేంద్ర హోమ్ శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి రమేష్ లేఖ రాయడం నిజమేనని నిర్ధారించారు. కేంద్ర హోమ్ సెక్రెటరీ ఏపీ ఛీప్ సెక్రెటరీకి ఫోన్ చేసి మాట్లాడారు అని కేంద్ర హోమ్ సహాయ మంత్రి చెప్పుకొచ్చారు.

అయితే ఆ పార్టీ నేతలు, మంత్రులు, సలహాదారులు, అసలు లేఖ అనేదే లేదు అన్నట్టు వాదించడం గమనార్హం. అంటే కేంద్ర ప్రభుత్వం నుండి దీని మీద క్లారిఫికేషన్ వస్తుందని అనుకోకపోవడంతో అసలు లేఖ రాయనే లేదు అని తమ నేతల ద్వారా, తమ సొంత, అనుకూల మీడియా ద్వారా చెప్పే ప్రయత్నం చేసింది అధికార పక్షం.

ఏకంగా ముఖ్యమంత్రి ఉన్నత అధికారులతో తమ ప్రభుత్వం మీద ఉద్దేశపూర్వకంగా విషప్రచారం చేసిన మీడియా సంస్థలపై చర్యలు తీసుకోవడంపై చర్చించారు అని కూడా వార్తలు వేయించారు అంటే ఎంతగా విషయాన్ని పక్కదారి పట్టించే ప్రయత్నం చేశారో అర్ధం అవుతుందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. “అధికార పక్షం ఆస్కార్ లెవెల్ యాక్టింగ్ చేసింది,” అంటూ ఎద్దేవా చేస్తున్నారు