Eatela Rajender BJP Huzurabad Byelectionsహుజురాబాద్ అనగానే…కేసీఆర్ ఓటమి…ఈటల గెలుపు…ఈ రెండు మాత్రమే ప్రస్తావనకు వచ్చేవది. కేసీఆర్ ను ఎదురించిన వీరుడిలా ఈటల ఎక్కడా లేనంత పాపులారిటీ సంపాదించాడు. ఈటలను టార్గెట్ చేసిన లేని అపవాదును మూటగట్టుకున్నారు కేసీఆర్.

అయితే ఈ హడావుడి అంతా కూడా ఓ కొలిక్కి వచ్చింది. ఈ సందర్భంలోనే మరో కొత్త చర్చ ప్రారంభమైంది. ఈటల ఇంతటి భారీ విజయాన్ని ఎలా కైవసం చేసుకున్నారు. డబ్బు, అధికారం ఉన్న గులాబీ అధినేతకు ఎదురు నిల్చున్నాడు.

కారు పార్టీని ఎదుర్కొనేందుకు ఈటల పన్నిన వ్యూహాలు ఏంటన్న ప్రశ్నలు అందరిలోనూ మెదులుతున్నాయి. ముఖ్యంగా ఆయన ఎన్నికల సమయంలో డబ్బు ఖర్చు పెట్టిన విధానం చాలా పకడ్బందీ ఏర్పాటు చేసిన తీరు…బీజేపీ వర్గాల్లో పెద్దెత్తున చర్చకు దారితీసింది. అసలు ఈటల స్థాయిలో ఎన్నికల్లో దిగడం బీజేపీ నేతలకు సాధ్యమవుతందా…అనే సందేహాలు కూడా వ్యక్తం అవుతున్నాయి.

హుజురాబాద్ ఎన్నిక చాలా కాస్ట్లీ ఎన్నిక. అధికార పార్టీ హామీలతోపాటు భారీగా ఖర్చు పెట్టింది. అధికారపార్టీని ఢీకొట్టేందుకు బీజేపీ కూడా అదే స్థాయిలో ఖర్చు చేసిందని ఆరోపణలు లేకపోలేవు. హోరాహోరీగా సాగిన ఈ ఎన్నికలో ఈటల విజయం సాధించారు. ఈ విషయం పక్కనపెడితే…ఇప్పడు కాషాయ శిబిరంలో కొత్త టెన్షన్ స్టార్ట్ అయ్యిందట.

హుజురాబాద్ లో ఖర్చు చేసిన విధానం చూసిన బీజేపీ నేతలు హడలెత్తిపోతున్నారట. ఇంత ఖర్చు పెట్టారా అంటూ నోరెళ్లబెడుతున్నారట. తమకు పార్టీ టికెట్ ఇచ్చినట్లయితే…ఇంత మొత్తన్ని ఎక్కడి నుంచి తీసుకురావాలన్న ఆందోళన మొదలైందట.

ఇక బీజేపీ అభ్యర్థులు ఎక్కడ పోటీ చేసినా…అక్కడి బీజేపీ అనుబంధ సంఘాలు ప్రచారం చేస్తారు. అయితే హుజురాబాద్ కు ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన నేతలకు చేసిన ఏర్పాట్లు చూసి కార్యకర్తలు ఆశ్చర్యపోయారట. ఏంటీ ఇంతలా చేసిన ఏర్పాట్లను ఇంతవరకు ఎప్పుడూ చూడాలేదంటూ చర్చించుకున్నారట.

చివరకు ఇంత భారీ మొత్తంలో ఖర్చు చేసినా…ఫలితం మాత్రం కమలం పార్టీని ఆనందంలో ముంచెత్తేలా చేసింది. అయితే ఖర్చులను లెక్కెసుకున్న బీజేపీల్లో మాత్రం కొత్త టెన్షన్ మొదలైందంటున్నారు.

పార్టీ తరపున టిక్కెట్టు ఇస్తే ఇంత మొత్తంలో ఖర్చు చేయాలా…డబ్బు ఎక్కడినుంచి తీసుకురావాలని కాషాయ దళాల్లో ఒక్కటే ఆందోళన. ప్రచారానికి వచ్చే కార్యకర్తలకు ఇలాంటి ఏర్పాట్లు చేయగలమా అని చర్చించుకుంటున్నారు.

ఇక ఈటల రెండు సార్లు మంత్రిగా చేశారు. ఆయనకు అర్దబలం ఉంది….అందుకే ఇంతలా ఖర్చు చేశారు. మేమేం ఎక్కడినుంచి తేగలమంటూ కమల పార్టీ నేతల్లో సందేహాలు మొదలయ్యాయి.