YS Jagan - Chandrababu-Naiduమొన్నటి వారంలో కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన సులభతర వాణిజ్య ర్యాంకులలో (ఈజ్ అఫ్ డూయింగ్ బిజినెస్) ఆంధ్రప్రదేశ్ తన మొదటి స్థానం నిలబెట్టుకుంది. ప్రతిపక్షంలో ఉండగా ఈ ర్యాంకులను తీసి పడేసిన వైఎస్సార్ కాంగ్రెస్ నేతలు ఇప్పుడు వాటి క్రెడిట్ కోసం తహతహలాడుతున్నాయి.

ఈ ర్యాంకులు తమ హయాంలోని 2018-19 ర్యాంకులని టీడీపీ వారు అంటుంటే… అవి మా హయాంలోని 2019-20 ర్యాంకులని అధికార పక్షం వారు అంటున్నారు. ఈ పంచాయతీ… కావాలని చేసిందో లేక అనుకోకుండా చేసిందో గానీ కేంద్ర ప్రభుత్వమే తేల్చింది. ఆ ఈవెంట్ కు సంబంధించిన ప్రెస్ రిలీజ్ లో ఈ ర్యాంకులు 2018-19 కాలానికి సంబంధించినవని క్లారిటీ ఇచ్చింది.

దానితో ఈ మొదటి ర్యాంకు క్రెడిట్ అప్పటి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం చేపట్టిన సంస్కరణల వల్లే అని తేలిపోయింది. ఏది ఏమైనా ఈ ర్యాంకులు గొప్పవి అని ఒప్పుకోవడంతో వచ్చే ఏడాది ర్యాంకులలో ఆంధ్రప్రదేశ్ ఎలా ఉంటుంది అనేది కీలకం కాబోతుంది. వచ్చే ఏడాది మొదటి ర్యాంకు రాకపోతే అది అధికార పక్షానికి ఇబ్బందే.

మరోవైపు.. గత ఏడాది రెండవ ర్యాంకులో ఉన్న తెలంగాణ ఇప్పుడు మూడవ ర్యాంకుకు పడిపోయింది. దానితో అక్కడి అధికారపక్షం ఈ విషయంపై సైలెంట్ అయిపోయింది. అక్కడి ప్రతిపక్షం కూడా స్ట్రాంగ్ గా లేకపోవడంతో అధికార పక్షాన్ని దాని గురించి ప్రశ్నించే వారు కూడా లేరు.