తెలుగు సినిమా ఇండస్ట్రీలో అనతి కాలంలోనే ప్రత్యేక గుర్తింపు ఏర్పరుచుకున్న ప్రముఖ నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ తన కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీలో భాగంగా ఒక షార్ట్ ఫిలింను నిర్మించ సంకల్పించింది. ఒక సామాజిక అంశాన్ని స్పృశిస్తూ నిర్మిస్తున్న ఈ షార్ట్ ఫిలింలో వెస్ట్ ఇండీస్ క్రికెటర్ డ్వెయిన్ బ్రేవో ఒక కీలక పాత్రలో నటించబోతున్నాడు. దీనికి సంబంధించి నేటి ఉదయం వీరిరువురి మధ్య ఒప్పందాలు జరిగాయి.
సోషల్ అవేర్నెస్ కు సంబంధించి రూపొందే ఈ లఘు చిత్రం కోయంబత్తూర్, తమిళనాడు, అలాగే వెస్ట్ ఇండీస్ లోని ట్రినిడాడ్, టొబాగో లలో చిత్రీకరణ జరుపుకుంటుంది. రేపటినుంచి కోయంబత్తూర్ లో షూటింగు ప్రారంభమవుతుందని దీనికి సంబంధించిన మరిన్ని వివరాలను త్వరలోనే మీడియాకు తెలుపుతామని ప్రకటించారు నిర్మాత ప్రకటించారు. ప్రస్తుతం జరుగుతున్న క్రికెట్ వరల్డ్ కప్ లో బ్రేవో రిజర్వు ప్లేయర్ గా ఉన్నారు.
అనతికాలంలోనే ఎం.ఎల్.ఎ, వైఫ్ ఆఫ్ రామ్, సిల్లీఫెలో, గూఢచారి చిత్రాలను నిర్మించిన ఈ సంస్థ ప్రస్తుతం సమంత అక్కినేని ప్రధాన పాత్రలో ఓ బేబి, విక్టరీ వెంకటేష్ – యువ సమ్రాట్ నాగ చైతన్య కాంబినేషన్ లో భారీ మల్టీస్టారర్ వెంకీ మామ, అనుష్క, మాధవన్, కిల్ బిల్ ఫేమ్ మైఖేల్ మ్యాడసన్ కాంబినేషన్లో ఇంటర్నేషనల్ ఫిల్మ్ సైలెన్స్, నాగ శౌర్యతో చిత్రాలను నిర్మిస్తోంది. ఓ బేబి వచ్చే నెల 5న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. వెంకీ మామ షూటింగ్ వైజాగ్ లో జరుగుతుంది. సైలెన్స్ షూటింగ్ అమెరికాలో జరుగుతుంది.