dwaraka-movie-theatrical-trailer‘పెళ్లిచూపులు’ సినిమాతో ఒక్కసారిగా లైంలైట్ లోకి వచ్చిన హీరో విజయ్ దేవరకొండ. ఎంతవరకు విజయ్ కు పేరొచ్చిందంటే… ఇటీవల పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు తమ్ముడిగా నటించాల్సిన రోల్ లో విజయ్ నటనను చూసి, పవన్ ఎంపిక చేసారన్న గాసిప్ లు పుట్టుకొచ్చేటంతగా! అలా మెస్మరైజ్ చేసిన విజయ్ దేవరకొండ తాజాగా “ద్వారక” సినిమా రూపంలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.

సూపర్ గుడ్ ఫిల్మ్స్ అధినేత ఆర్ బి చౌదరి సమర్పిస్తున్న ఈ సినిమా ఆడియో విడుదల సందర్భంగా… సందడి చేసిన ధియేటిరికల్ ట్రైలర్ లో సినిమా కధను మొత్తం చెప్పేయడం విశేషం. సహజంగా కధ తెలియకుండా, ఆసక్తికరమైన సన్నివేశాలతో ట్రైలర్ ను కట్ చేస్తుంటారు. కానీ, ‘ద్వారక’ విషయంలో మాత్రం పూర్తి కధను బయటపెట్టేసారు. ఎంటర్టైన్మెంట్ పంథాలో సాగే ఈ సినిమా కధ ‘క్రైమ్ అండ్ కామెడీ’గా రూపుదిద్దుకున్నట్లు ట్రైలర్ స్పష్టం చేసింది.

శ్రీకృష్ణుడు విగ్రహాన్ని ఎత్తేయడం ద్వారా శక్తులున్న బాబాగా విజయ్ అవతరించడం… అయితే బాబాగా నటిస్తూ డబ్బులు సంపాదించడం వెనుక ఓ బలమైన కారణం ఉండడం… విగ్రహం చుట్టూ పోలీసులు, విలన్లు తిరిగే విధంగా… “అయ్యారే + స్వామిరారా” సినిమాలను గుర్తుకు తెస్తోంది ఈ ట్రైలర్. అయితే సినిమాలో ఎంపిక చేసిన తారాగణం అంతా ఫ్రెష్ వారే కావడంతో… ప్రేక్షకులకు కొత్తదనం కనిపించవచ్చు.