Duvvada Jagannadham Malayalam టాలీవుడ్ ‘స్టైలిష్ స్టార్’ అల్లు అర్జున్ కు మాలీవుడ్ లో భారీ ఫాలోయింగ్ ఉన్న విషయం తెలిసిందే. బన్నీ నటించిన ‘బద్రినాధ్, ఇద్దరమ్మాయిలతో’ వంటి సినిమాలు తెలుగు నాట పరాజయం పాలైనా, మలయాళంలో మాత్రం మంచి విజయాలను సొంతం చేసుకున్నాయి. అలాగే ఇటీవల బన్నీకి స్టార్ డం తెచ్చిపెట్టిన సినిమాలు కూడా మాలీవుడ్ లో బన్నీ రేంజ్ ను పెంచాయి. దీంతో ఇటీవల టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద నిరుత్సాహపరిచిన “దువ్వాడ జగన్నాధమ్” సినిమా కూడా మాలీవుడ్ లో చెలరేగిపోతుందని భావించారు.

అయితే అందరి అంచనాలను తలక్రిందులు చేస్తూ మాలీవుడ్ ప్రేక్షకులు బన్నీకి షాక్ ఇచ్చే తీర్పును ఇచ్చారు. టాలీవుడ్ లో కనీసం ఓపెనింగ్స్ ను దక్కించుకున్న ‘డీజే,’ అక్కడ మాత్రం అది కూడా లేకుండా పోయిందని ట్రేడ్ వర్గాల టాక్. నిజానికి బన్నీకున్న ఫాలోయింగ్ కు ఇది ఊహించని పరిణామం. ‘స్టార్ డం’ అంటే సినిమా టాక్ తో నిమిత్తం లేకుండా ఓపెనింగ్స్ ను తీసుకురావడమే! అందులో విఫలమైతే ‘స్టార్ హీరో’ అన్న పదానికి అర్ధం ఉండదు. బహుశా తెలుగు వర్షన్ ను ముందుగా చూసేసారో లేక ‘ఇంగువ’ రుచి రుచించలేదో ఏమో గానీ, ‘డీజే’ అంతటా నిరుత్సాహ పరిచింది.