duvvada-jagannadham-latest-update-harish-shankarగత మూడేళ్ళుగా ‘స్టైలిష్ స్టార్’ అల్లు అర్జున్ ఇమేజ్ అంతకంతకూ పెరుగుతూ పోతోంది. సమ్మర్ లో వరుసగా సినిమాలు విడుదల చేస్తూ సక్సెస్ లు అందుకుంటున్న బన్నీ, అదే సెంటిమెంట్ తో ఈ ఏడాది కూడా ‘దువ్వాడ జగన్నాథమ్’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ‘గబ్బర్ సింగ్’ ఫేం హరీష్ శంకర్ దర్శకత్వం వహించిన ఈ సినిమాకు సంబంధించి తాజాగా ఓ అప్ డేట్ ఇచ్చారు దర్శకుడు.

‘దువ్వాడ జగన్నాథమ్’ సినిమా ఎడిటింగ్ ప్రారంభమైందని, ‘అవుట్ పుట్’ చాలా బాగా వచ్చిందని, అనుమానం లేకుండా అల్లు అర్జున్ ప్రేక్షకుల మనసు దోచుకుంటాడని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ మెగా ఫ్యాన్స్ కు స్వీట్ న్యూస్ అందించాడు. సైలెంట్ గా సాగుతున్న ఈ సినిమా ఎడిటింగ్ ప్రారంభమైందంటే… ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుందన్న సంకేతాలను హరీష్ ఇచ్చేసారు. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమాలో బన్నీ సరసన ‘ముకుంద’ ఫేం పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్న విషయం తెలిసిందే.