Duvvada Jagannadham Collections 100 crఇటీవల కాలంలో “దువ్వాడ జగన్నాధమ్” సినిమా కలెక్షన్స్ పై జరిగినంత చర్చ మరో సినిమా కలెక్షన్స్ పై జరగలేదని చెప్పడంలో సందేహం లేదు. ఈ ఏడాది సంక్రాంతికి విడుదలైన ‘ఖైదీ నంబర్ 150, గౌతమీపుత్ర శాతకర్ణి’ సినిమాల సందర్భంలోనూ కలెక్షన్లపై చర్చ జరిగింది గానీ, రచ్చ జరగలేదు. కానీ ‘డీజే’ విషయంలో అదే జరుగుతోంది. అందుకు కారణాలు లేకపోలేదు… ప్రేక్షకుల నుండి ‘నెగటివ్’ టాక్ తెచ్చుకున్న ఈ సినిమా, ఏకంగా ‘నాన్ – బాహుబలి’ రికార్డులను కొట్టేసిందన్న చిత్ర యూనిట్ ప్రకటనే, ‘ఫేక్’ రికార్డులకు ‘డీజే’ కేరాఫ్ అడ్రస్ గా మారిందన్న ప్రచారం జరిగింది.

తాజాగా ఈ సినిమా నైజాం కలెక్షన్స్ 20 కోట్లుకు చేరుకున్నాయని, తన కెరీర్ లో ‘గబ్బర్ సింగ్, దువ్వాడ జగన్నాధమ్’ సినిమాలు ఈ ఫీట్ ను అందుకున్నాయని, ఇందుకు ప్రేక్షకులందరికీ కృతజ్ఞతలు తెలిపారు హరీష్. దీనికి సంబంధించి నైజాంలోని ఏరియాల వారీగా సాధించిన కలెక్షన్స్ ను కూడా జత చేస్తూ… దమ్ముంటే ఇవి ఫేక్ రికార్డులని నిరూపించాలని సవాల్ విసిరారు. ఒకవేళ అలా నిరూపిస్తే తాను సినిమాలను తీయడం ఆపేస్తానని కూడా హరీష్ ఛాలెంజ్ చేసారు.

నిజానికి ఈ సినిమా సక్సెస్ మూడ్ లో ఉంటూ ఎంజాయ్ చేస్తున్నానని, అయితే ఇటీవల జరుగుతున్న ‘ఫేక్ కలెక్షన్స్’ అన్న ప్రచారానికి అడ్డు కట్ట వేయాలంటే ‘యుద్ధం శరణం గచ్చామి’ అనక తప్పడం లేదని ఈ సందర్భంగా అభిప్రాయపడ్డారు. విమర్శలను నేను తీసుకుంటాను గానీ, ఫేక్ ఆర్టికల్స్ తో నా చిత్ర యూనిట్ సభ్యుల కష్టాన్ని కొల్లగొడతాను అంటే మాత్రం ఊరుకోనని తేటతెల్లం చేసారు. దీంతో సోషల్ మీడియాను మరోసారి హరీష్ ఎంత సీరియస్ గా తీసుకున్నారో అర్ధమవుతోంది. మరి ఇప్పటికైనా ‘డీజే’ ఫేక్ కు శుభం కార్డు పడుతుందో లేదో చూడాలి.