Duvvada Jagannadham 7 million Clicksప్రస్తుతం యూ ట్యూబ్ రికార్డులను లెక్కపెట్టుకునే పనిలో అభిమానులు నిమగ్నమై ఉన్నారు. ‘బాహుబలి 2’ సినిమా ట్రైలర్ అద్వితీయమైన క్లిక్స్ ను అందుకోవడం… ఆ తర్వాత ఇటీవల విడుదలైన ప్రిన్స్ మహేష్ బాబు ‘స్పైడర్’ టీజర్… సరికొత్త రికార్డులను సృష్టించడంతో… తాజాగా విడుదలైన అల్లు అర్జున్ “దువ్వాడ జగన్నాధమ్” క్లిక్స్ పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. అయితే అంచనాలను అధిగమించే విధంగా తొలి 24 గంటలలో యూ ట్యూబ్ లో 4 మిలియన్ క్లిక్స్ ను అందుకుంది.

నిజానికి సినీ అభిమానులను మెప్పించడంలో ఈ ట్రైలర్ అంతగా సక్సెస్ కాలేదు గానీ, యూ ట్యూబ్, ఫేస్ బుక్ క్లిక్స్ విషయంలో మాత్రం బన్నీ చిత్రాలలో టాప్ స్థాయిలో నిలిచింది. తొలి గంటలో వచ్చిన స్పందనతో ‘స్పైడర్’ టీజర్ రికార్డులను కూడా దాటేస్తుందని అంచనాలు వేసినప్పటికీ, అది సాధ్యం కాలేదు. ‘స్పైడర్’ టీజర్ తొలి 24 గంటల్లో దాదాపుగా 4.7 మిలియన్ క్లిక్స్ ను అందుకోగా, ‘దువ్వాడ జగన్నాధమ్’ దాదాపుగా 4 మిలియన్ క్లిక్స్ కే పరిమితమైంది. అయితే ఫేస్ బుక్ క్లిక్స్ విషయంలో బన్నీ ట్రైలర్ దే పై చేయి.

ఇక ఫిబ్రవరిలో విడుదలైన ‘దువ్వాడ జగన్నాధమ్’ టీజర్ సృష్టించిన ‘మోస్ట్ డిస్ లైక్డ్ టీజర్’ (1.82 లక్షల డిస్ లైక్స్) తర్వాత లైక్స్, డిస్ లైక్స్ కు కూడా ప్రాముఖ్యత దక్కాయి. క్లిక్స్, లైక్స్ విషయంలో ‘స్పైడర్’ దరిచేరలేకపోయిన ‘దువ్వాడ,’ డిస్ లైక్స్ విషయంలో మాత్రం, మళ్ళీ బన్నీదే పై చేయి అని చెప్పక తప్పదు. ఇప్పటివరకు 10 మిలియన్ క్లిక్స్ పైగా అందుకున్న ‘స్పైడర్’ టీజర్ దాదాపుగా 27 వేల డిస్ లైక్స్ ను అందుకోగా, 4 మిలియన్ క్లిక్స్ ను చేరుకునే పాటికే 37 వేల డిస్ లైక్స్ తో ‘దువ్వాడ జగన్నాధమ్’ ముందు నిల్చున్నాడు.

డిస్ లైక్స్ లో ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ “కాటమరాయుడు” ట్రైలర్ తో, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ “దువ్వాడ జగన్నాధమ్” పోటీ పడుతున్నాడు. ఇప్పటివరకు దాదాపుగా 7 మిలియన్ క్లిక్స్ ను అందుకున్న ‘కాటమరాయుడు’ ట్రైలర్ కు 68 వేల డిస్ లైక్స్ వచ్చాయి. ప్రస్తుతం 37 వేల డిస్ లైక్స్ తో మహేష్ ‘స్పైడర్’ను దాటేసి, పవన్ కళ్యాణ్ ‘రాయుడు’ ట్రైలర్ తో పోటీ పడుతున్నాడు ఈ అల్లు వారబ్బాయి. 24 గంటలు మాత్రమే గడవడంతో ‘కాటమరాయుడు’ డిస్ లైక్స్ ను ‘దువ్వాడ’ తేలికగా దాటేస్తాడన్నది వెబ్ టాక్.