Will Nani’s Loss Be Dulquer Salmaan’s Gain, Again?మలయాళీ సూపర్ స్టార్ దుల్కర్ సల్మాన్ మహానటి తర్వాత మరో స్ట్రెయిట్ తెలుగు చిత్రానికి సంతకం చేశారు. బహుళ బాషా చిత్రంగా నిర్మించనున్న ఈ చిత్రానికి హను రాఘవపుడి దర్శకత్వం వహించనున్నారు. దుల్కర్ సల్మాన్ ను ఈ సినిమా లెఫ్టినెంట్ రామ్‌గా చూడనున్నారు, ఇది 1964 నాటి పీరియడ్ సినిమా.

ఇది యుద్ధ నేపథ్యంలో లవ్ స్టోరీ అని మేకర్స్ అంటున్నారు. మొదట్లో ఈ దర్శకుడు ఈ స్టోరీని న్యాచురల్ స్టార్ నానికి వినిపించాడు అయితే ఎందుకనో ఈ ప్రాజెక్టు ముందుకు కదలలేదు. ఇప్పుడు అదే స్క్రిప్ట్ దుల్కర్ సల్మాన్ కు చేరింది. ఈరోజు దుల్కర్ పుట్టినరోజు సందర్భంగా ఉదయం ప్రీ-లుక్ పోస్టర్‌తో అధికారిక ప్రకటన చేశారు.

ప్రియాంక దత్ ఈ చిత్రాన్ని స్వప్నా సినిమాస్ బ్యానర్‌ పై నిర్మించనున్నారు. అశ్విని దత్ తన వైజయంతి మూవీస్ బ్యానర్‌లో దీనిని సమర్పించనున్నారు. విశాల్ చంద్రశేఖర్ ఈ సినిమాకు మ్యూజిక్ చేస్తున్నారు. కరోనా మహమ్మారి కొంచెం తగ్గాకా ఈ సినిమా షూటింగ్ మొదలవుతుంది.

దుల్కర్ సల్మాన్ చివరి సినిమా కనులు కనులు దోచాయంటే కరోనా లాక్ డౌన్ ముందు తెలుగులోని చివరి హిట్ సినిమా. అనామక సినిమాగా విడుదలైన ఆ సినిమా అనూహ్యంగా ప్రేక్షకుల మద్దతుతో హిట్ గా నిలిచింది. ఈ తాజా చిత్రంతో మరో పెద్ద హిట్ కొట్టి తెలుగులో తన మార్కెట్ పెంచుకోవాలని చూస్తున్నాడు దుల్కర్.