dubbaka mla raghunandanరాజకీయ నాయకుల మాటలు… మరీ ముఖ్యంగా రెండు తెలుగు రాష్ట్రాలలోని బీజేపీ నాయకుల మాటలు చాలా చిత్రంగా ఉంటాయి. మొన్న ఆ మధ్య దుబ్బాక నుండి గెలిచిన ఎమ్మెల్యే రఘునందన్ అటువంటి వ్యాఖ్య ఒకటి చేశారు. సోమవారం భద్రాద్రి కొత్తగూడెంలో పర్యటించిన ఆయన భద్రాది రాముడిని దర్శించుకున్నారు.

తన దృష్టిలో కేసీఆర్‌ సన్నాసి అని, భద్రాద్రి ఆలయ అభివృద్ధికి రూ.100 కోట్లు కేటాయిస్తామని సీఎం ప్రకటించి ఏళ్లు గడుస్తున్నా ఆహామీ నెరవేర్చలేదన్నారు. . కేసీఆర్‌కు చేతకాదని ఒప్పుకుంటే నెల రోజుల్లో ఆలయ అభివృద్ధికి రూ.100 కోట్లు కేంద్రం నుంచి తెస్తామని చెప్పారు. కేంద్రం నుండి నిధులు తేవడానికి కేసీఆర్ ఒప్పుకోవాలా?

కేసీఆర్ సన్నాసి అని ఆయనే అన్నారు… ఇక ఆయన ఒప్పుకోకుండానే 100 కోట్లు తీసుకుని రావొచ్చు కదా? ఏ రాజకీయ నాయకుడైనా తనకు చేతకాదని ఒప్పుకోడు కదా? ఒప్పుకోరు కాబట్టి 100 కోట్లు తేవక్కర్లేదు అనుకుని ఉత్తుత్తి స్టేట్మెంట్ ఇచ్చేశారా? ఒకవేళ కేసీఆర్ 100 కోట్లు… కేంద్రం 100 కోట్లు ఇచ్చేస్తే రాముడికి ఖర్చుపెట్టలేని పరిస్థితి ఏమీ రాదు కదా?

గుడిని ఘనంగా 200 కోట్లతో అభివృద్ధి చెయ్యవచ్చు. ఇటీవలే ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్ లో తెలంగాణకు ఒక్క రూపాయి కూడా తీసుకుని రాలేకపోయారు. ఇప్పుడు ఏకంగా ఒక గుడికి 100 కోట్లు తీసుకొస్తారట. పోనీ బడ్జెట్ లో రఘునందన్ నియోజకవర్గానికి 10 రూపాయిలు అయినా వచ్చాయా?