Driver Ramudu Teaser Talkఇటీవల కాలంలో కమెడియన్లు హీరోలు అయ్యే ట్రెండ్ కొనసాగుతోంది. ఈ కోవలోనే ‘జబర్దస్త్’ ద్వారా పాపులర్ అయిన కమెడియన్ షకలక శంకర్ కూడా చేరాడు. శ్రీకాకుళం యాసలో మాట్లాడుతూ హాస్యాన్ని పండించే షకలక శంకర్, ‘డ్రైవర్ రాముడు’ పేరుతో తెరకెక్కిన సినిమాలో ప్రధాన పాత్రను పోషించాడు. ఈ సినిమాకు సంబంధించిన టీజర్ ను చిత్ర యూనిట్ తాజాగా విడుదల చేసారు.

కమెడియన్లు హీరో అయ్యేటప్పుడు మాస్ రోల్స్ ను మాత్రమే ఎంచుకునే సంప్రదాయాన్ని షకలక శంకర్ కూడా కొనసాగించాడని ఈ టీజర్ స్పష్టం చేసింది. డ్రైవర్ రోల్ లో కనిపించిన శంకర్, ‘సై’ విలన్ తో కలిసి హాస్యాన్ని పండించే ప్రయత్నం చేసాడు. చూసేది హాస్యం అని వీక్షకులు అనుకునే విధంగా కట్ చేసిన ఈ టీజర్ లో ఇంపాక్ట్ షాట్ ఒక్కటీ లేదు, షకలక శంకర్ సూపర్ శ్రీకాకుళం యాస తప్ప!